English | Telugu

ఫొటో ఫీచ‌ర్‌: న్యూయార్క్‌లో షారుఖ్ కూతురు పార్టీలు!

ద న్యూయార్క్ యూనివ‌ర్సిటీ టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చ‌దువుతోంది బాలీవుడ్ బాద్‌షా ముద్దుల త‌న‌య సుహానా ఖాన్‌. కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏడాది ఇండియాకు వ‌చ్చేసిన ఆమె, త‌న కోర్సును కంప్లీట్ చేయ‌డానికి న్యూయార్క్‌కు తిరిగి వెళ్లింది. అక్క‌డ త‌న ఫ్రెండ్స్‌ని క‌లుసుకున్న ఆమె వారితో స‌ర‌దాగా టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చ‌ర్స్ ఇప్పుడు నెట్టింట తెగ సంద‌డి చేస్తున్నాయి. న్యూయార్క్ సిటీలో చేసుకున్న హౌస్ పార్టీలో త‌న ఫ్రెండ్స్‌తో తీయించుకున్న ఫొటోల‌ను షేర్ చేసింది సుహానా.

ఆ ఫొటోల‌కు "l8r, not. now." అనే క్యాప్ష‌న్ జోడించింది. ఆ ఫొటోల్లో కో-ఆర్డ్ ఔట్‌ఫిట్‌లో అద‌ర‌గొడుతోంది సుహానా. స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌, దానికి మ్యాచ్ అయ్యే హై-వెయిస్టెడ్ పెన్సిల్ స్క‌ర్ట్‌తో ఆకర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. మెడ‌లో ముత్యాల నెక్‌లెస్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.

ఓవైపు యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటూనే, మ‌రోవైపు సిటీలో త‌న ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా గ‌డుపుతోంది. ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్న 20 ఏళ్ల సుహానా మ‌రోసారి లేటెస్ట్ ఫొటోల‌తో ఆ పేరుకు న్యాయం చేస్తోంద‌ని చెప్పాలి.