English | Telugu

జాన్వీ క‌పూర్ హార‌ర్ మూవీ.. రిలీజ్ కి రెడీ!

శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ న‌టించిన ఫ‌స్ట్ హార‌ర్ మూవీ.. రూహీ. రాజ్ కుమార్ రావ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాని హార్థిక్ మెహ‌తా తెర‌కెక్కించారు. దినేష్ విజ‌న్ నిర్మించిన ఈ చిత్రం.. నిర్మాణం పూర్తిచేసుకుని చాన్నాళ్ళే అయింది. అయితే క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కి రెడీ అయింది. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ఈ హార‌ర్ మూవీ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. మ‌రి.. ఈ జాన్వికి రూహీ ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

కాగా ధ‌డ‌క్, గుంజ‌న్ స‌క్సెనా చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ క‌పూర్.. ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ జెర్రీ అనే సినిమాలో న‌టిస్తోంది. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన త‌మిళ చిత్రం కొల‌మావు కోకిల‌కి రీమేక్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్. రాయ్ గుడ్ ల‌క్ జెర్రీని నిర్మిస్తుండ‌డం విశేషం. అలాగే దోస్తానాకి సీక్వెల్ గా రూపొందుతున్న దోస్తానా 2 లోనూ జాన్వీ నాయిక‌గా న‌టిస్తోంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.