English | Telugu
‘ఆశికి3’ టీజర్ రిలీజ్.. శ్రీలీలకు లిప్‌లాక్‌లు, XYZ చెయ్యక తప్పలేదు!
Updated : Feb 17, 2025
టాలీవుడ్‌లోకి జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చిన శ్రీలీల వరసగా కొన్ని సినిమాలు చేసి తీరిక లేని హీరోయిన్ అనిపించుకుంది. 2024 సంక్రాంతికి ఆమె నటించిన గుంటూరు కారం రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆ పెర్‌ఫార్మెన్స్‌కి, డాన్స్‌కి అందరూ ముగ్ధులైపోయారు. అప్పటి వరకు బిజీగా ఉన్న శ్రీలీల ఆ సంవత్సరం తెలుగులోనే కాదు ఏ భాషలోనూ హీరోయిన్‌గా ఒక్క సినిమా కూడా చెయ్యకపోవడం విచిత్రం. అయితే పుష్ప2లో ‘కిస్సిక్..’ సాంగ్‌తో ప్రేక్షకుల్ని పలకరించినా పూర్తి స్థాయి హీరోయిన్‌గా మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న రాబిన్‌హుడ్, మాస్ జాతర, తమిళ్‌లో పరాశక్తి చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఏ నటికైనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా టాప్ పొజిషన్‌కి వెళ్లాలనే కోరిక ఉంటుంది. శ్రీలీల టార్గెట్ కూడా అదే. బాలీవుడ్ ఎంట్రీకి ఎంతో కాలంగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఆశికి సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఆశికి3లో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఆశికి సిరీస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరిస్తారు. ప్రేమను వ్యక్తం చేసే మార్గాలుగా చెప్పుకునే లిప్‌లాక్ సీన్స్‌ను విరివిగా వాడతారు. అందుకే యూత్ ఆ సినిమాల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని, ఆసక్తిని కలిగి ఉంటుంది. 2013లో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఆశికి2 చిత్రాన్ని 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, 109 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్స్ చాలా ఉంటాయి. అంతేకాదు, ఈ సినిమా ఆడియో పరంగా చాలా పెద్ద హిట్. అందుకే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిసింది. దీనికి ముందు 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా మహేష్ భట్ తెరకెక్కించిన ఆశికి చిత్రం మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్. 1 కోటి రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే 5 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఆ తరహా సినిమాలు లెక్కకు మించి వచ్చాయి.
ఇంత చరిత్ర ఉన్న ఆశికి సిరీస్‌లోని మూడో భాగం ద్వారా శ్రీలీల ఎంట్రీ ఇవ్వడం ఆమెకు శుభసూచకంగానే చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన శ్రీలీల ఏ సినిమాలోనూ లిప్‌లాక్‌లుగానీ, ఇంటిమేట్ సీన్స్‌గానీ చెయ్యలేదు. అయితే ఆశికి3లో శ్రీలీల ఎంపికైంది అనే న్యూస్ వచ్చిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. హాట్ సీన్స్‌లో ఇప్పటివరకు నటించని శ్రీలీల ఈ సినిమా చెయ్యడం ఏమిటి అనే చర్చ కూడా జరిగింది. ఆ సినిమా చేస్తే తప్పకుండా అవన్నీ చెయ్యాల్సిందేనని అందరూ సర్ది చెప్పుకున్నారు. అయితే శ్రీలీల అన్నింటికీ సిద్ధపడే ఆ సినిమా కమిట్ అయిందన్న విషయం తాజాగా రిలీజ్ అయిన ఆశికి3 టీజర్ ద్వారా తెలుస్తోంది. టీజర్‌లో అలాంటి సన్నివేశాలు పూర్తి స్థాయిలో కనిపించకపోయినా.. సినిమాలో మాత్రం లెక్కకు మించి ఉంటాయనే హింట్ మాత్రం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీగానే పెరిగాయి. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. పుష్ప2లోని కిస్సిక్ సాంగ్‌తో కుర్రకారుకి కిర్రెక్కించిన శ్రీలీల.. ఆశికి3లో పూర్తి స్థాయి అందాల విందు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.