English | Telugu
పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ శ్రేయా ఘోషల్
Updated : May 22, 2021
సింగర్ శ్రేయా ఘోషల్‌కు శనివారం మధ్యాహ్నం తొలి సంతానంగా మగబిడ్డ పుట్టాడు. ఈ శుభవార్తను తన అభిమానులు, శ్రేయోభిలాషులకు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. "ఈ మధ్యాహ్నం దేవుని ఆశీర్వాదం వల్ల మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. మా కుటుంబాలతో పాటు శైలాదిత్య, నేను చాలా సంతోషంతో ఉన్నాం. ఇలాంటి ఎమోషన్‌ను ఇదివరకెన్నడూ పొందలేదు. మా చిన్నారికి అసంఖ్యాక ఆశీర్వాదాలు పంపిన మీకు ధన్యవాదాలు." అని ఆమె షేర్ చేసింది.
2015 ఫిబ్రవరిలో తన చిన్ననాటి స్నేహితుడు శైలాదిత్య ముఖోపాధ్యాయతో బెంగాలీ సంప్రదాయ ప్రకారం శ్రేయ వివాహం జరిగింది. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని 2021 మార్చి నెల మొదట్లో ఆమె వెల్లడించింది. అప్పుడు తన బేబీ బంప్‌ను ప్రదర్శించే ఫొటోను షేర్ చేసిన ఆమె, "బేబీ శ్రేయాదిత్య రాబోతోంది! శైలాదిత్య, నేను ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం." అని రాసుకొచ్చింది.
శ్రేయా ఘోషల్, శైలాదిత్య తల్లిదండ్రులు అయిన సందర్భంగా సంగీత ప్రపంచం నుంచి పలువురు సెలబ్రిటీలు అభినందన సందేశాలు పంపుతున్నారు.