English | Telugu
సల్మాన్ ఖాన్ కెరీర్ ని నాశనం చేసింది వీళ్లేనా!
Updated : Apr 3, 2025
స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)రీసెంట్ గా ఈద్(Eid)సందర్భంగా మార్చి30న యాక్షన్ డ్రామా 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గతంలో సల్మాన్ తో జుడ్వా,హర్ దిల్ జో ప్యార్ కరేగా,కిక్ వంటి చిత్రాలని నిర్మించిన సాజిద్ నడియావాలా(Sajid Nadiadwala)సికందర్ కి నిర్మాతగా వ్యవహరించాడు.ప్రచార చిత్రాలు బాగుండటం,పలు ఇంటర్వ్యూలలో సాజిద్ మాట్లాడుతు,సికందర్ తప్పకుండా అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు.దీంతో సల్మాన్ ప్లాప్ ల పరంపరకి సికందర్ ముగింపు పలకబోతుందని ఫ్యాన్స్ భావించారు.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద 'సికందర్' ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.
దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సాజిద్ ని తిడుతు పోస్ట్ లు చేస్తున్నారు.కొంత మంది ఫ్యాన్స్ అయితే సల్మాన్ కెరీర్ ని సాజిద్ నాశనం చేస్తున్నాడంటు కూడా పోస్ట్ లు చేస్తున్నారు.ఇప్పుడు వాటిని సాజిద్ సతీమణి వార్ధా ఖాన్ రీ పోస్ట్ చేస్తున్నారు.పైగా సాజిద్ ని తిట్టిన వాళ్ళని తిడుతు కామెంట్స్ కూడా చేస్తుండటంతో,విమర్శలని రీ పోస్ట్ చేస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదా అని ఒక నెటిజన్ అడిగాడు.మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని సదరు నెటిజన్ కి రిప్లై ఇచ్చింది.
తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్(Ar Murugadoss)దర్శకత్వంలో సికందర్ తెరకెక్కగా సల్మాన్ తో స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)జత కట్టింది.కాజల్ అగర్వాల్,సత్యరాజ్,షర్మాన్ జోషి,ప్రతీక్ బబ్బర్,అంజనీ ధావన్,కిషోర్,సంజయ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.సల్మాన్ తో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ బాగున్నా కూడా కథ,కథనాలు,దర్శకత్వం బాగోలేదనే అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.