Read more!

English | Telugu

పుష్పలో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ కి గుండెపోటు 

శ్రేయాస్ తల్పడే.. మరాఠీ సీరియల్స్ నుంచి హిందీ చిత్ర సీమలోకి అడుగుపెట్టి  హౌస్ ఫుల్ 2 , గోల్ మాల్ రిటర్న్స్ , ఓం శాంతి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ అనే గుర్తింపుని పొందాడు. రీసెంట్ గా వెల్ కమ్ టు జంగిల్ ,ఎమర్జెన్సీ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఒక సినిమా షూటింగ్ లో శ్రేయాస్  గుండె నొప్పికి గురవ్వడం ఒక్కసారిగా బాలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది.

శ్రేయాస్ వెల్ కమ్ టు జంగిల్ అనే సినిమా షూటింగ్ లో ఉండగా హఠాత్తుగా గుండె నొప్పితో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ ఇప్పించడంతో శ్రేయాస్ కి  ప్రాణాపాయం తప్పింది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలా లాంగ్వేజ్ లలో విడుదల అయ్యింది. అందులో భాగంగా హిందీ చిత్ర సీమలో కూడా  పుష్ప విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. హిందీ పుష్పకి అల్లు అర్జున్ క్యారక్టర్ కి సంబంధించిన వాయిస్ కి శ్రేయాసే డబ్బింగ్ చెప్పాడు. అచ్చం బన్నీకి సూట్ అయ్యేలా చెప్పి బన్నీ ని బాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరయ్యేలా శ్రేయాస్ చేసాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

త్వరలో రాబోయే పుష్ప 2 కి హిందీ వెర్షన్ కి  కూడా బన్నీ కి శ్రేయాసే తన గొంతుని అందించబోతున్నాడు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న  ఎమర్జెన్సీ అనే చిత్రంలో శ్రేయాస్ మాజి ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి క్యారక్టర్ ని పోషిస్తుండం విశేషం.