English | Telugu
అగ్ర హీరో సినిమాకి వెళ్తే రెండు సమోసాలు ఒక టీ ఉచితం
Updated : Jul 15, 2024
మనసు గతి ఇంతే మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇప్పుడు ఈ పాటని స్వయంగా సినిమానే పాడుకుంటూ ఉంది. స్క్రీన్ గతి ఇంతే సినిమా బతుకింతే అని. ఎందుకు సినిమా ఆ విధంగా పాడుకోవాల్సి వస్తుందో చూద్దాం.
అక్షయ్ కుమార్(akshay kumar)హిందీ సినిమా ప్రపంచంలో మూడున్నర దశాబ్దాలుగా తన సత్తా చాటుతు వస్తున్నాడు. రీసెంట్ గా సర్ఫిరా (sarfira)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరల్డ్ వైడ్ గా ఈ నెల 12 న రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీకి వచ్చే ప్రేక్షకులకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాని ప్రకారం ఒక్కో ప్రేక్షకుడికి రెండు సమోసాలు, ఒక టీ ఉచితంగా ఇస్తారు. అయితే ఈ ఆఫర్ మల్టిప్లెక్స్ లకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది. అక్షయ్ లాంటి టాప్ స్టార్ మూవీకి ఈ ఆఫర్ ని ఫిక్స్ చెయ్యడం వెనుక ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి అక్షయ్ వరుస పరాజయాలని ఎదుర్కుంటున్నాడు. పైగా అవి మాములు పరాజయాలు కాదు. వరుసగా పదకొండు సినిమాలని పరిగణనలోకి తీసుకుంటే అందులో కేవలం ఒక చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. ఇంకోటి యావరేజ్ గా నిలిచింది. మిగతావన్నీ ప్లాప్ లుగా ముద్రపడ్డాయి. దీంతో ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడానికే ఆ ఆఫర్ ని ప్రకటించడం జరిగింది.
ఇక సర్ఫిరా కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ట్రేడ్ వర్గాలు అయితే అక్షయ్ గత చిత్రాల ప్లాప్ లిస్ట్ లో చేర్చారు. సూర్య(suriya)హీరోగా తమిళంతో పాటు తెలుగులో తెరకెక్కిన ఆకాశమే హద్దురా కి రీమేక్ గా సర్ఫిరా తెరకెక్కింది. మూడు భాషల్లోను సుధా కొంగర(sudha kongara)నే దర్శకత్వం వహించింది. అక్షయ్ తో పాటు రాధికా మదన్. పరేష్ రావెల్, ప్రకాష్ బెల్వాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సూర్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు.