English | Telugu

అక్షయ్ కుమార్ కి కరోనా..మరి అంబానీ ఇంట పెళ్ళికి వెళ్తున్నాడా!

ఇండియన్ సినీ ప్రేమికులని మూడున్నర దశాబ్దాలపై నుంచి తనదైన నటనతో అలరిస్తు వస్తున్న హీరో అక్ష‌య్ కుమార్.(akshay kumar)కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఇలా ఏ జోనర్ లో అయినా సూపర్ గా పెర్ఫార్మ్ చెయ్యడం అక్షయ్ స్టైల్. అదే విధంగా సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు కూడా చేస్తూ ఎంతో మంది హీరోలకి ఆదర్శంగా కూడా నిలుస్తాడు. తాజాగా అయన హెల్త్ కి సంబంధించిన న్యూస్ ఒకటి అభిమానులని కలవరపాటుకి గురి చేస్తుంది.

అక్షయ్ లేటెస్ట్ మూవీ  స‌ర్ఫిరా. ఈ రోజు  ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ నేపధ్యంలో  గత కొన్ని రోజుల నుంచి స‌ర్ఫిరా (sarfira)ప్రమోషన్స్ లో అక్ష‌య్ బిజీ బిజీగా గడిపాడు. దీంతో  అనారోగ్యానికి గురవ్వడం జరిగింది. హాస్పిటల్ లో చెకప్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని డాక్టర్స్ నిర్దారించారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. ప్రస్తుతం తన ఇంట్లోనే  అక్షయ్  విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక కోవిడ్ వలన నేడు జ‌రుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చంట్ ల వివాహ వేడుక‌కు అక్ష‌య్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

స‌ర్ఫిరా లో  రాధిక మ‌ద‌న్ హీరోయిన్ గా చెయ్యగా  ప‌రేష్ రావ‌ల్, సీమా బిస్వాస్, ప్ర‌కాశ్ బేలావాడి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లోమెరిశారు. తమిళ సూపర్ స్టార్ సూర్య(suriya)సూరారై పొట్రు కి రీమేక్ గా  స‌ర్ఫిరా తెరకెక్కింది.సూర్య‌,  జ్యోతిక‌,అరుణ భాటియా, విక్ర‌మ్ మ‌ల్హోత్రాలు సంయుక్తంగా నిర్మించారు.తమిళ మాతృక కి దర్శకత్వం వహించిన సుధా కొంగ‌ర నే దర్శకురాలిగా చేసింది. ఈ మూవీ తెలుగులో ఆకాశమే హద్దురా అనే టైటిల్ తో వచ్చింది.