English | Telugu

`మాస్ట‌ర్` రీమేక్ లో స‌ల్మాన్?

ద‌క్షిణాది రీమేకుల్లో న‌టించ‌డం.. వాటితో విజ‌యాలు అందుకోవ‌డం బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కి కొత్తేమీ కాదు. `హ‌లో బ్ర‌ద‌ర్` రీమేక్ `జుడ్వా`తో మొద‌లుకుని.. `వాంటెడ్` ( `పోకిరి` రీమేక్), `రెడీ`, `కిక్`, `బాడీగార్డ్` వ‌ర‌కు ప‌లు విజ‌య‌వంత‌మైన ద‌క్షిణాది రీమేక్స్ లో సంద‌డి చేశాడు స‌ల్లూ భాయ్.

క‌ట్ చేస్తే.. స్వల్ప విరామం త‌రువాత మ‌రో సౌత్ రీమేక్ కి స‌ల్మాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ సంక్రాంతికి విడుద‌లై స‌క్సెస్ అయిన `మాస్ట‌ర్`ని హిందీ లో పునర్నిర్మించ‌డానికి స‌‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇందులోనే స‌ల్మాన్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. కోలీవుడ్ స్టార్స్ విజ‌య్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని హిందీ నేటివిటికి త‌గ్గ‌ట్టు మార్పులుచేర్పులు చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని వినికిడి. ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు మ‌రికొద్ది రోజుల్లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

కాగా, స‌ల్మాన్ తాజా చిత్రం `రాధే` రంజాన్ కానుక‌గా మే 13న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ప్ర‌భుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దిశా ప‌టాని నాయిక‌గా న‌టించింది. జాకీ ష్రాఫ్, ర‌ణ‌దీప్ హుడా, భ‌ర‌త్, మేఘా ఆకాశ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.