English | Telugu
అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శ్రద్ధా కపూర్..
Updated : Apr 5, 2021
`చాల్ బాజ్`.. అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్ లో ఓ మెమరబుల్ మూవీ. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కథానాయకులుగా నటించిన ఈ హిందీ సినిమాలో అంజు, మంజుగా తన ద్విపాత్రాభినయంతో మెస్మరైజ్ చేశారు శ్రీదేవి. పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. 32 ఏళ్ళ క్రితం వసూళ్ళ వర్షం కురిపించింది.
కట్ చేస్తే.. `చాల్ బాజ్` దర్శకుడు పంకజ్ పరాశర్ స్వల్ప విరామం తరువాత మెగాఫోన్ పట్టి `చాల్ బాజ్ ఇన్ లండన్` పేరుతో ఓ సినిమా తీయబోతున్నారు. పూర్తిగా లండన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రద్ధా కపూర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రద్ధకిదే తొలి `డబుల్ రోల్` మూవీ. `చాల్ బాజ్ ఇన్ లండన్`లో నాయిక పాత్రకి శ్రద్ధ కరెక్ట్ ఛాయిస్ అంటూ.. ఆమె తప్ప మరెవరూ ఆ పాత్రకి న్యాయం చేయలేరని పంకజ్ ప్రస్తావించడం గమనార్హం. భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అహ్మద్ ఖాన్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.