English | Telugu
నేను నమ్మే దేవుడు నా ఆయుష్షు ఎంత వరకు ఇచ్చాడంటున్న సల్మాన్
Updated : Mar 29, 2025
సల్మాన్ ఖాన్(Salman Khan)వన్ మాన్ షో 'సికిందర్'(Sikandar)రంజాన్(ramadin)కానుకగా ఈ నెల 31 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే.సల్మాన్ సరసన రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చేస్తుండగా గతంలో హిందీలో అమీర్ ఖాన్ తో 'గజని'ని తెరకెక్కించి హిందీ చిత్ర సీమకి ఫస్ట్ టైం 100 కోట్ల కలెక్షన్స్ ని పరిచయం చేసిన ఏ ఆర్ మురుగదాస్(Ar Murugadoss)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన సాజిద్ నడియావాలా అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.
రీసెంట్ గా జరిగిన మూవీ ప్రమోషన్స్ లో 'లారెన్స్ బిష్ణోయ్' గ్యాంగ్ తనని చంపుతానని చేస్తున్న బెదిరింపులపై సల్మాన్ మాట్లాడుతు నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను.నా జీవితం ఆయన ఇష్టం మీదనే ఆధారపడి ఉంది.నా ఆయుష్షు ఎంత వరకు ఇచ్చాడో అంతవరకే ఉంటాను.ప్రభుత్వం గట్టి భద్రత కలిపించినా ఒక్కోసారి అది పెను సవాలుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
సికందర్ మూవీ పై అయితే సల్మాన్ అభిమానుల్లో కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ప్రచార చిత్రాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.బాహుబలి కట్టప్ప సత్య రాజ్ విలన్ గా చేస్తుండగా కాజల్ అగర్వాల్,కిషోర్,అంజినిధావన్, షర్మాన్ జోషి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.