English | Telugu
దాడి జరిగినప్పుడు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చెయ్యలేదు..చనిపోతావా అని నా కొడుకు అడిగాడు
Updated : Feb 10, 2025
ప్రముఖ బాలీవుడ్ హీరో 'సైఫ్ అలీఖాన్'(Saif Ali Khan)పై కొన్ని రోజుల క్రితం జరిగిన దాడి ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిన విషయమే.పోలీసులు రీసెంట్ గా ఈ కేసు కి సంబంధించి ఐడెంటిఫికేషన్ పెరేడ్ చేపట్టడం జరుగగా,ఈ కేసులో అరెస్టైయిన మహ్మద్ షరీఫుల్ నే,సైఫ్ మీద దాడి దాడి చేసిందని,సైఫ్ ఇంటి పని మనుషులు గుర్తించారు.
రీసెంట్ గా సైఫ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా మీద దాడి జరిగినప్పుడు చిన్న గాయం అయిందని అనుకున్నాను. కత్తితో పొడిచారని మాత్రం అనుకోలేదు.కాకపోతే వీపులో విపరీతమైన నొప్పి కలిగినప్పుడు మాత్రం కత్తితో పొడిచారని అర్ధమయింది.దీంతో కరీనా(Karina kapoor)ఎంతో కంగారుపడిపోయి అందరికి ఫోన్లు చేసింది.కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు.ఆ సమయంలో నా పక్కనే ఉన్న నా కొడుకు తైమూర్(Taimur)నాన్న నువ్వు చనిపోతావా అని అడిగితే అలా ఏం జరగదని చెప్పాను.
ఆ తర్వాత నేను, కరీనా,తైమూర్ ముగ్గురం ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళాం.ఒక వేళ నాకేమైనా జరిగినా కూడా ఆ సమయంలో నా కొడుకు నా పక్కనే ఉండాలని అనుకున్నానని సైఫ్ చెప్పుకొచ్చాడు.సైఫ్ అయితే ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.సైఫ్ మీద జరిగిన దాడికి ప్రధాన కారణం సైఫ్ కుటుంబం సరైన సెక్యూరిటీ ని నియమించుకోకపోవడం వలనే అని పోలీసులు భావిస్తున్నారు.