English | Telugu

‘నేను బ్రతికే ఉన్నాను’.. పోలీసులను ఆశ్రయించిన నటుడు!

ఇటీవలికాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించి రాయడంలో సోషల్‌ మీడియా ఎప్పుడూ ముందుంటోంది. కేవలం వ్యూస్‌ కోసం కొత్త వార్తలు సృష్టించి మరీ వైరల్‌ చేస్తున్నారు. అలాంటి ఓ వార్త బాలీవుడ్‌ నటుడు రజా మురాద్‌ను మానసిక వేదనకు గురి చేసింది. రజా మురాద్‌ చనిపోయాడనే వార్త ఎంతో స్పీడ్‌గా వైరల్‌ అయిపోయింది. విషయం తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, అభిమానులు ఫోన్లు, మెసేజ్‌ చేశారు. దీంతో విపరీతంగా ఆందోళనకు గురయ్యారు మురాద్‌.

ఈ విషయంపై రజా మురాద్‌ పోలీసులను ఆశ్రయించారు. వైరల్‌ అవుతున్న న్యూస్‌ గురించి పోలీసులకు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సోషల్‌ మీడియా బాగా పెరిగిన తర్వాత ఏ వార్త నిజమైందో, ఏది అబద్ధమో చెప్పడం కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా సినీ నటుల విషయంలో ఇది ఎక్కువైపోయింది. బ్రతికి ఉన్నవారినే చనిపోయారంటూ వారి ఫోటోలను పెట్టి దండ వేసి మరీ చెబుతున్నారు. ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు ఇలాంటి ఇబ్బందిని అనేకసార్లు ఎదుర్కొన్నారు. అలాగే కమెడియన్‌ మల్లిఖార్జునరావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన చనిపోయారంటూ మీడియాలో వార్త వచ్చేసింది. ఇప్పుడు రజా మురాద్‌ విషయంలో కూడా అదే జరిగింది. తను బ్రతికే ఉన్నట్టు ప్రపంచానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

1972లో నటుడుగా పరిచయమైన రజా మురాద్‌.. 53 సంవత్సరాలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విలన్‌గా అనేక సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. తెలుగులో రుద్రనేత్ర, ఇంద్ర, జానీ, సుభాష్‌ చంద్రబోస్‌, బిజినెస్‌మేన్‌ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు మురాద్‌. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్న రజా మురాద్‌.. పలు భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.