English | Telugu

అవార్డ్స్‌ సాధించినా.. అతి శృంగారం వల్ల థియేటర్లలో బ్యాన్‌.. ఓటీటీలో ఒకే!

‘ఆగ్రా’.. ఇండియాలో రూపొందిన హిందీ సినిమా. విదేశాల్లో జరిగిన పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అని ప్రశంసించారు. ఈ సినిమాకి మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మోహిత్‌ అగర్వాల్‌కి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. అలాగే 76వ కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను చూసిన ప్రముఖులు 5 నిమిషాల పాటు స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న ‘ఆగ్రా’ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డ్‌.

సినిమాలో మూడు నగ్న సన్నివేశాలున్నాయని, వాటిని బ్లర్‌ చేసి చూపిస్తే సర్టిఫికెట్‌ ఇస్తామని సెన్సార్‌ బోర్డ్‌ తెలిపింది. అయితే ‘ఆగ్రా’ దర్శకనిర్మాతలు తాము సినిమాలో ఎలాంటి ఛేంజెస్‌ చెయ్యబోమని ఛాలెంజ్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అన్ని విషయాలు పరిశీలించిన కోర్టు.. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, సర్టిఫికెట్‌ ఇవ్వొచ్చని తీర్పునిచ్చింది. దాంతో సెన్సార్‌ బోర్డ్‌ ‘ఆగ్రా’ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్‌ చెయ్యకపోవడం విశేషం. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్‌ అయిన తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉండగా ముందుగానే ఈ సినిమా ఓటీటీలో లభ్యమవుతోంది.

హీరోయిన్‌ రుహాని శర్మ తను చేసిన ప్రతి సినిమాలోనూ పద్ధతిగల పాత్రలు పోషించింది. అయితే ఈ సినిమాలో మాత్రం హద్దులు దాటి అందాలు ఆరబోసింది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ అంత బోల్డ్‌గా కనిపించని రుహానిశర్మ.. హెవీ డోస్‌లో శృంగారాన్ని పంచింది. బోల్డ్‌ సీన్స్‌, ఇంటిమసీ సీన్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల థియేటర్లలో ఈ సినిమాను బ్యాన్‌ చేశారు. అయితే అమెజాన్‌ ప్రైమ్‌లో మాత్రం ఫ్రెంచ్‌ భాషలో మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు.