English | Telugu
రాఖీ సావంత్ తల్లికి కేన్సర్.. సాయం చేస్తున్న సల్మాన్!
Updated : Feb 26, 2021
ఐటమ్ గాళ్‌గా పేరుపొందిన నటి రాఖీ సావంత్ తల్లి జయ కేన్సర్ బారిన పడి, ముంబైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల్లో చాలా వరకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన తమ్ముడు సొహైల్ ఖాన్ భరిస్తున్నారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ వీడియోలో ఆ ఇద్దరికీ థాంక్స్ చెప్పారు తల్లీకూతుళ్లు.
ఆ వీడియోలో హాస్పిటల్ బెడ్ మీదున్న జయ, థాంక్యూ మై సన్ సల్మాన్ ఖాన్. థాంక్యూ సొహైల్. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు కెమోథెరఫీ జరగుతోంది. ఈరోజుతో నాలుగు రౌండ్లు కెమో పూర్తయింది. ఇంకా రెండు రౌండ్లు చేయించుకోవాలి. ఆ తర్వాత నాకు ఆపరేషన్ చేస్తారు. నీకు సక్సెస్ రావాలని, క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. దేవుడు నీతో ఉంటాడు. నీ డ్రీమ్స్ అన్నింటినీ దేవుడు తీరుస్తాడు అని చెప్పారు. చివరలో రాఖీ, థాంక్యూ సల్మాన్‌జీ, మీరొక రాక్‌స్టార్ అని చెప్పింది.
అంతకుముందు, రెండు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తల్లి ఫొటోలు షేర్ చేసిన రాఖీ, ఆమె కోసం ప్రార్థించాల్సిందిగా తన అభిమానులను అర్థించింది. "అమ్మ కోసం ప్రార్థించండి, ఆమె కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది." అని ఆ ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది.
ఇటీవలే ఆమె సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 14 సీజన్లో ఫైనల్ దాకా వెళ్లి, చివరలో రూ. 14 లక్షలు తీసుకొని బయటకు వచ్చింది.