English | Telugu
ఫ్రెండ్ లవర్ పై మనసు పారేసుకున్నాడు కదా..హీరో గురించి అగ్ర దర్శకుడి వివరణ
Updated : Feb 3, 2025
సామాజిక సమస్యని సరికొత్త కోణంలో ఆవిష్కరించి,వాటిని ప్రేక్షకాదరణ పొందేలా చెయ్యడంలో బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ 'రాజ్ కుమార్ హిరానీ'(Rajkumar Hirani)ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.'మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహే మున్నాభాయ్,త్రీ ఇడియట్స్,పీకే,సంజు,డంకీ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.రాసి కంటే వాసి ప్రధానంగా భావించే 'రాజ్ కుమార్ హిరానీ' 2003 నుంచి కేవలం ఆరుచిత్రాలకి మాత్రమే దర్శకత్వం వహించాడంటే సినిమా పట్ల ఆయనకి ఉన్న కమిట్ మెంట్ ని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా రాజ్ కుమార్ హిరానీ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది.అందులో తన గత చిత్రం 'సంజు' గురించి మాట్లాడుతు 'సంజు విడుదలయ్యాక నేను సంజయ్ దత్(Sanjay Dutt)కి సంబంధించిన నిజాలని కప్పిపుచ్చడానికే ఆ సినిమాని తెరకెక్కించానని చాలా మంది అనుకున్నారు.మూవీలో సంజయ్ డ్రగ్స్ తీసుకుంటాడని చూపించాను.ఫ్రెండ్ లవర్ పై మనసు పారేసుకున్న వాడిలాగా కూడా చూపించాను.సంజయ్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చే వాడినైతే అలాంటివి చూపించను కదా.
నిజానికి నేను సంజయ్ తో రెండు చిత్రాలు తెరకెక్కించినా కూడా మా ఇద్దరి మధ్య హీరో,దర్శకుడుకి మధ్య ఉన్న రిలేషన్ తప్ప మరెలాంటి రిలేషన్ లేదు. సంజయ్ పెరోల్ పై బయటకి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే వెళ్లి కలిసాను.ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం.ఆ తర్వాత రెగ్యులర్ గా ఇద్దరం కలిసే వాళ్ళం.ఆ సమయంలో తన పర్సనల్ విషయాలన్నీ చెప్పడంతో పాటుగా,తన తండ్రి గురించి కూడా చెప్పేవాడు. దాంతో ఆయన జీవితం మీద సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకొని సంజయ్ బంధువులు,సన్నిహితుల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకొని 'సంజు' ని తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు.'సంజు' మూవీ 2018 లో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి ప్రేక్షకాదరణనే పొందింది.సంజయ్ దత్ క్యారక్టర్ లో రణబీర్ సింగ్(Ranbir SIngh)అత్యద్భుతంగా చేసాడు.రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం పికె పార్ట్ 2 ని తెరకెక్కించబోతున్నాడు.