Read more!

English | Telugu

భ‌ర్త‌తో విడిపోతోందంటూ రూమ‌ర్స్ వ‌స్తున్న‌వేళ.. 'మ్యాట్రిక్స్ 4' లుక్‌ షేర్‌ చేసిన ప్రియాంక‌!

 

ఒక‌వైపు భ‌ర్త నిక్ జోనాస్‌తో విడిపోనున్న‌దంటూ రూమ‌ర్స్ వైర‌ల్ అవుతుంటే, మ‌రోవైపు 'మ్యాట్రిక్స్ 4'లో త‌న కొత్త లుక్‌ను షేర్ చేసింది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా. మునుప‌టి మ్యాట్రిక్స్ మూవీస్‌లో లీడ్ రోల్ చేసిన హాలీవుడ్ టాప్ యాక్ట‌ర్‌ కియాను రీవ్స్ మ‌రోసారి త‌న పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ నాలుగో సీక్వెల్ 'ద మ్యాట్రిక్స్ రిస‌ర‌క్ష‌న్స్‌'లో ప్రియాంక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ది. త‌న క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె, దానికి "And she’s here. Re-enter #TheMatrix 12.22.21." అనే క్యాప్ష‌న్ జోడించింది. ఆ వెంట‌నే జోయా అఖ్త‌ర్‌, ప‌త్ర‌లేఖ‌, పుల్‌కిత్ సామ్రాట్‌, హ్యుమా ఖురేషి, సోనాల్ చౌహాన్ లాంటి సెల‌బ్రిటీలు కామెంట్ సెక్ష‌న్‌లో ఫైర్ ఎమోజీల‌ను పెట్టారు.

నిన్న ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ హ్యాండిల్స్‌లో భ‌ర్త ఇంటిపేరు జోనాస్‌ను తొల‌గించ‌డంతో ఆ ఇద్ద‌రూ విడిపోనున్నారంటూ రూమ‌ర్స్ వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత నిక్ షేర్ చేసిన ఓ వీడియోకు ప్రియాంక "డామ్‌.. నేనిప్పుడే నీ చేతుల్లో మ‌ర‌ణించాను" అంటూ కామెంట్ పెట్టి, ఆ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టింది.

'ద మ్యాట్రిక్స్ రిస‌ర‌క్ష‌న్స్' వ‌చ్చే డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌వుతుండ‌గా, ఆ సిరీస్‌లోని తొలి మూవీ 'ద మ్యాట్రిక్స్‌'ను డిసెంబ‌ర్ 3న రి-రిలీజ్ చేస్తున్న‌ట్లు సోమ‌వారం వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ పిక్చ‌ర్స్ ప్ర‌క‌టించింది. కియాను రీవ్స్‌, క్యారీ-ఆన్ మోస్‌, లారెన్స్ ఫిష్‌బ‌ర్న్‌, హ్యూగో వీవింగ్ న‌టించిన 'ద మ్యాట్రిక్స్' మూవీని లానా వ‌చౌస్కీ, లిల్లీ వ‌చౌస్కీ సిస్ట‌ర్స్ డైరెక్ట్ చేశారు. వారు డైరెక్ట్ చేసిన త‌ర్వాతి రెండు సీక్వెల్స్ 'ద మ్యాట్రిక్స్ రిలోడెడ్‌', 'ద మ్యాట్రిక్స్ రివ‌ల్యూష‌న్స్' 2003లోనే వ‌చ్చాయి. 

యాహ్యా అబ్దుల్ మ‌తీన్ II, జెస్సికా హెన్‌విక్‌, నీల్ ప్యాట్రిక్ హారిస్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేసిన 'ద మ్యాట్రిక్స్ రిస‌ర‌క్ష‌న్స్‌'కు లానా వ‌చౌస్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.