English | Telugu

అగ్ర సంగీత దర్శకుడి ఇంట్లో దొంగతనం..జమ్ము కాశ్మీర్ కి లింకు 

ధూమ్(Dhoom),ధూమ్ 2,గ్యాంగ్ స్టార్, డార్లింగ్, భూల్ భులయ్య,రేస్,ది పవర్ ఆఫ్ వన్, న్యూ యార్క్,లవ్ ఆజ్ కల్, గరం మసాలా, చెక్ లెట్ ఇలా సుమారు ముప్పైకి పైగా సినిమాలకి అధ్బుతమైన సాంగ్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని అందించారు ప్రీతం చక్రవర్తి(Pritam Chakraborty)కొన్ని రోజుల క్రితం ప్రీతం దగ్గర ఎంతో కాలంగా పని చేస్తున్న సాయల్ అనే వ్యక్తి సరుకులు ఇంట్లో ఇస్తానని చెప్పి లాకర్ లో ఉన్న 40 లక్షలు తీసుకొని పరారయ్యాడు.దీంతో ప్రీతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సుమారు 400 సి సి కెమెరాలని పరిశీలించడం జరిగింది.అనంతరం నిందితుడ్ని జమ్ము కాశ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది.


Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.