English | Telugu
ఇది చాలా బెస్ట్ డీల్.. రిలీజ్ రోజే 1+1 ఆఫర్.. షాక్ అవుతున్న ఇండస్ట్రీ!
Updated : Feb 22, 2025
సాధారణంగా మనం రకరకాల వస్తువులు కొనే సమయంలో కొన్ని ఆఫర్స్ మనకు కనిపిస్తుంటాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనీ, లేదా ఒకటి కొంటే రెండు ఉచితం అని చూస్తుంటాం. అయితే సినిమాలు చూసేందుకు కూడా ఈమధ్య ఆఫర్స్ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫర్లు మొదటి రోజు కాకుండా కొన్ని రోజులు నడిచిన తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి అనిపించినపుడు మాత్రమే పెడతారు. కానీ, సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ ఆఫర్ ఇచ్చారు ఓ సినిమా మేకర్స్.
అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మేరే హజ్బెండ్ కి బీవీ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేశారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. నెక్స్‌ట్ రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఇలాంటి ఆఫర్ పెట్టకపోతే ఆడియన్స్ థియేటర్స్‌కి రారేమో అనే ఆందోళన అందరిలోనూ పెరిగిపోతోంది. తాజాగా విడుదలైన ‘ఛావా’ చిత్రం సూపర్‌హిట్ కావడం, దానికి కలెక్షన్లు కూడా భారీగా ఉండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి రకుల్ ప్రీత్‌సింగ్ భర్త జాకీ భగ్నానీ ఓ నిర్మాత కావడం విశేషం. ఆఫర్ అయితే పెట్టారు కానీ, రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది.