English | Telugu
నా భార్య ద్వారా సంతోషం లేదంటున్న నవాజుద్దీన్ సిద్ధికి
Updated : Jun 27, 2024
నవాజుద్దీన్ సిద్ధికి( Nawazuddin siddiqui)భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప నటుడు..1999 లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన సర్పరోష్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, హౌస్ ఫుల్ 4 , నూరాని చహ్రా, బ్లాక్ ఫ్రైడే, పాన్ సింగ్ తోమర్, బాంబే టాకీస్, కహాని, థాక్రే ,లంచ్ బాక్స్, కిక్, సెక్షన్ 108 ఇలా ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ ని పొందాడు. లేటెస్ట్ గా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
నవాజుద్దీన్ వైఫ్ నేమ్ ఆలియా(aaliyah)2009 లో ఆ ఇద్దరి వివాహం జరిగింది. ఆలియా అసలు పేరు అంజనా కిషోర్ పాండే. పెళ్లి తర్వాత మతం మార్చుకొని మరి తన పేరుని మార్చుకుంది. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్ల కిందట ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తనని అత్తారింటిలోకి రాకుండా వేధిస్తున్నారంటూ ఆలియా ఏకంగా నడి రోడ్ పై దీక్ష కూడా చేసింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో ఆ ఇద్దరు విడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ తమ పిల్లల భవిష్యత్తు కోసం విడిపోకుండా కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా నవాజుద్దీన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం దండగ. అయినా ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు. ఒకరి మీద ఒకరికి నిజంగా ప్రేమ ఉంటే వివాహం చేసుకోకుండా కూడా ఆ ప్రేమని కొనసాగించవచ్చు. అలా కాకుండా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపిస్తారు.
దాంతో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వస్తున్నాయి. అందుకే పెళ్లి గోల అనేది లేకపోతే ఇద్దరు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. అలా కాదని వివాహ బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ప్రేమ రాను రాను కరిగిపోతుంది. మొదట్లో భార్య మనకి సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటాం. కానీ రాను రాను ఉద్యోగం, చేసే పని మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్, ఆలియా ల వివాహం జరిగి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది.ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.