English | Telugu
సినిమాపై పురుష హక్కుల సంస్థ విమర్శలు..దీని వెనుక ఆ మిసెస్ ఉంది
Updated : Feb 15, 2025
దంగల్,జవాన్ మూవీ ఫేమ్ 'సన్య మల్హోత్రా'(Sanya Malhotra)ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిసెస్'(Mrs).2021లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమాకి రీమేక్ గా మిసెస్ తెరకెక్కింది.నిశాంత్ దహియా,కన్వల్జిత్ సింగ్,అపర్ణ ఘోషల్,నిత్య మొయిల్ ప్రధాన పాత్రలు పోషించారు.ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పుడు ఈ మూవీపై 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్'అనే పురుష హక్కుల సంస్థ 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'మిసెస్' మూవీ మితిమీరిన స్త్రీ వాదాన్ని ప్రోత్సహిస్తుంది.ఒక మహిళ తన ఇంటి పని తాను చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల అవసరాలు తీరిస్తే అదెలా అణిచివేత అవుతుంది.వంట చెయ్యడం ద్వారా ఒత్తిడి దూరమయ్యి ప్రశాంతత లభిస్తుంది.కుటుంబం కోసం మగవాళ్ళు ఎంతో శ్రమిస్తారు.పని చేసే ప్రదేశాల్లో ఒత్తిడికి కూడా లోనవుతారని ట్వీట్ చేసింది.
దీంతో ఆ ట్వీట్ కి వ్యతిరేకంగా కొంత మంది సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తు'ఆడవాళ్లు కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కానీ బయట ఎన్ని పనులు చేసినా కూడా కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తున్నారు.కానీ పురుషులు ఇంటి పనుల్లో సాయం చేయకపోగా ఇష్టమైన ఫుడ్ కోసం డిమాండ్ చేస్తారంటూ ట్వీట్ లు చేస్తున్నారు.'మిసెస్' ని కదవ్(Kadav)దర్శకత్వంలో హర్మన్ బవేజా,పమ్మి బవేజా నిర్మాతలుగా వ్యవహరించారు.