English | Telugu

ద‌య‌నీయం 'ల‌గాన్' న‌టి ప‌రిస్థితి.. ఆమిర్ ఖాన్‌ను ప‌ని ఇవ్వ‌మ‌ని అడుగుతోంది!

"నా అనార్యోగం గురించి ఆమిర్‌ ఖాన్ భాయ్‌కు తెలియదు. తెలిస్తే.. ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు" అని 'లగాన్' చిత్ర నటి పర్వీనా ఆశాభావం వ్యక్తం చేశారు. త‌ను కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేయాలనుకుంటున్నట్లు పర్వీనా తన మనస్సులోని మాటను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో వారి కార్యాలయంలో కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ ఆమిర్‌ర్ ఖాన్‌తోపాటు ప్రొడక్షన్ హౌస్‌ యజమానులను పర్వీనా అభ్యర్థించారు.

'లగాన్‌' చిత్రంలో పని చేసిన పలువురు సహ నటులకు ఆమిర్‌ర్ ఖాన్ సహాయం చేశారని.. అందులో శ్రీ వల్లభ వ్యాస్‌ కూడా ఉన్నారని ఈ సందర్భంగా పర్వీనా గుర్తు చేసుకున్నారు. గతేదాడి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తీవ్ర అనారోగ్యానికి పాలైనానన్నారు పర్వీనా. దాంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా తయారైందని... తన కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే త‌న‌కు కొద్దిమంది సన్నిహితులు మాత్రం ఉన్నారని .. వారు మేము సైతం అంటూ సహాయ సహకారాలు అందించారని పర్వీనా వెల్ల‌డించారు. గతేడాది సినీ అండ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించారంటూ పర్వీనా తెలిపారు.

ఆమిర్‌ ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'లగాన్'. 'వన్స్ అపాన్ ఏ టైమ్' అనే ట్యాగ్ లైన్‌తో 2001లో విడుదలైంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దేశ విదేశాల్లో సైతం పలు అవార్డులను సొంతం చేసుకుంది. 'లగాన్' చిత్రానికి అశుతోష్ గోవరిక‌ర్‌ దర్శకత్వం వహించారు.

అయితే 'లగాన్‌'లో ఆమిర్‌తో కలసి నటించిన పర్వీనా పరిస్థితి నేడు కడు దయనీయంగా ఉంది. గతేడాది పర్వీనాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. తీవ్రఅనారోగ్యం పాలైంది. ఈ నేపథ్యంలో నాటి నుంచి ఆమె ఆర్థిక సహాయం కోసం చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో పర్వీనా ఒక ఆంగ్ల వార్తాప‌త్రిక‌తో మాట్లాడుతూ తన మనస్సులోని మాటల‌ను బ‌య‌ట‌పెట్టారు.