English | Telugu

హార‌ర్ మూవీ స్పెష‌లిస్ట్స్ 'రామ్‌సే బ్ర‌ద‌ర్స్‌'లో పెద్ద‌వాడైన కుమార్ క‌న్నుమూత‌!

హార‌ర్ ఫిలిమ్స్‌తో బాలీవుడ్‌లో ప్ర‌త్యేక స్థానం పొందిన 'రామ్‌సే బ్ర‌ద‌ర్స్‌'లో పెద్ద‌వాడైన డైరెక్ట‌ర్ కుమార్ రామ్‌సే గుండెపోటుతో గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. ముంబైలోని హీరానందానిలో ఉన్న స్వ‌గృహంలో కుమార్ మృతి చెందిన‌ట్లు ఆయ‌న కుమారుడు గోపాల్ తెలిపారు. "గుండెపోటుతో ఈరోజు వేకువ‌నే 5:30 గంట‌ల‌కు నాన్న‌గారు చివ‌రి శ్వాస విడిచారు. చాలా ప్ర‌శాంతంగా ఆయ‌న వెళ్లిపోయారు." అని గోపాల్‌ వెల్ల‌డించారు.

ప్రొడ్యూస‌ర్ ఎఫ్‌.యు. రామ్‌సే ఏడుగురు కుమారుల్లో కుమార్ పెద్ద‌వారు. మిగ‌తా ఆరుగురు.. కేషు, తుల‌సీ, క‌ర‌ణ్‌, శ్యామ్‌, గంగు, అర్జున్‌. 1970, 80ల‌లో లో-బ‌డ్జెట్‌తోటే రామ్‌సే బ్ర‌ద‌ర్స్ తీసిన హార‌ర్ ఫిలిమ్స్ క‌ల్ట్ మూవీస్‌గా పేరు తెచ్చుకున్నాయి. వాటిలో 'ఔర్ కౌన్‌', 'పురానా మందిర్‌', శ‌త్రుఘ్న సిన్హా న‌టించిన 'సాయా', రిషి క‌పూర్‌, న‌సీరుద్దీన్ షా న‌టించిన 'ఖోజ్' లాంటి సినిమాలు ఉన్నాయి. వాటి స్క్రిప్టుల విష‌యంలో కుమార్ రామ్‌సే ప్ర‌ధాన పాత్ర పోషించారు.

కుమార్‌కు భార్య షీలా, ముగ్గురు కుమారులు రాజ్‌, గోపాల్‌, సునీల్ ఉన్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.