English | Telugu
నేను జీవించడానికి కారణమైనవాడ్ని దేవుడు లాగేసుకున్నాడు!
Updated : Jul 8, 2021
లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి హృదయం బద్దలైంది. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా ఆయన చెంతనే ఉంటూ వస్తున్న ఆయన భార్య సైరా బాను అయితే తన జీవితంలో ఒక అంతర్భాగాన్ని కోల్పోయారు. బుధవారం దిలీప్ కుమార్ మరణం తరువాత తన జీవితంలో "కోహినూర్" ను కోల్పోయిన ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. తను 'జీవించడానికి కారణం' అయిన వ్యక్తిని తననుంచి 'లాక్కున్నారు' అని ఆమె అన్నారు.
పీపింగ్ మూన్‌లో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం, పిడి హిందూజా ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు, దిలీప్ మరణం తరువాత సైరా కుప్పకూలిపోయారని తెలిపారు. "దేవుడు నేను జీవించడానికి కారణమైనవాడిని లాక్కున్నాడు. సాబ్ లేకుండా, నేను దేని గురించీ ఆలోచించలేను. అందరూ, దయచేసి ప్రార్థించండి." అని ఆమె అన్నారు.
దిలీప్ కుమార్, సైరా బాను జంట భారతీయ సినిమా సుప్రసిద్ధ జంటల్లో ఒకటి. దిలీప్‌ను ఆమె 1966 అక్టోబర్ 11న వివాహం చేసుకున్నారు. హిందూజా ఆసుపత్రిలో జూన్ 7న ఆయన చివరి శ్వాస తీసుకోవడానికి ముందు 55 సంవత్సరాల ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడిపారు. గమనించాల్సిన విషయం ఏమంటే, సైరా బాను చాలా చిన్న వయస్సు నుండే దిలీప్ కుమార్ తో ప్రేమలో ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో, తాను 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే దిలీప్ సాబ్‌ను ప్రేమించాననీ, 22 ఏళ్ల వయసులో ఆయనను వివాహం చేసుకున్నానని ఆమె చెప్పారు.