Read more!

English | Telugu

హిందీలో 'కేజీఎఫ్-2' జోరు తగ్గింది.. 'బాహుబలి-2' రికార్డు సేఫ్!

హిందీలో మొదటివారం 'బాహుబలి-2'కి మించిన కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్ చాప్టర్-2'.. రెండో వారం బాహుబలి-2 తో పోల్చి చూస్తే కాస్త వెనకపడింది. దీనిని బట్టి చూస్తే ఓవరాల్ కలెక్షన్స్ లో బాహుబలి-2 ని కేజీఎఫ్-2 బీట్ చేసే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాహుబలి-2 మొదటివారం 247 కోట్ల నెట్ రాబడితే కేజీఎఫ్-2 ఏకంగా 255.05 కోట్లతో సత్తా చాటింది. అయితే పదిరోజుల కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం బాహుబలి 327.75 కోట్లు వసూలు చేస్తే.. కేజీఎఫ్ 298.44 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఓ సౌత్ సినిమాకి హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ రావడం గొప్పే అయినప్పటికీ బాహుబలితో పోల్చి చూస్తే మాత్రం కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి.

మొదటి ఐదారు రోజులు బాహుబలి-2 ని మించిన జోరు చూపించిన కేజీఎఫ్-2 ఆ తర్వాత జోరు తగ్గించింది. పదో రోజు బాహుబలి-2 కి హిందీలో 34.50 కోట్లు వస్తే కేజీఎఫ్-2 కి 18.25 కోట్లు వచ్చాయి. పదిరోజుల్లో 298.44 కోట్ల నెట్ సాధించిన కేజీఎఫ్-2 నేడు 300 కోట్ల క్లబ్ లో చేరనుంది. బాహుబలి-2 తర్వాత హిందీలో 300 కోట్ల క్లబ్ లో చేరిన సౌత్  సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు క్రియేట్ చేయనుంది. ఫుల్ రన్ లో హిందీలో బాహుబలి-2 510 కోట్ల నెట్ వసూలు చేయగా.. కేజీఎఫ్-2 దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముంది అంటున్నారు.