Read more!

English | Telugu

అరుదైన రికార్డు.. 'బాహుబలి-2' తర్వాత 'కేజీఎఫ్-2'నే

హిందీలో 'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రభంజనం కొనసాగుతోంది. 11 వ రోజు ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఫీట్ సాధించడానికి 'బాహుబలి-2' కి పదిరోజులు పట్టగా కేజీఎఫ్-2 కి 11 రోజులు పట్టింది.

మొదటివారం హిందీలో ఏకంగా 255.05 కోట్ల నెట్ రాబట్టి బాహుబలి-2 కి మించిన కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన కేజీఎఫ్-2 రెండో వారం కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఎనిమిదో రోజు 13.58 కోట్లు, తొమ్మిదో రోజు 11.56 కోట్లు, పదో రోజు 18.25 కోట్లు వసూలు చేసిన కేజీఎఫ్-2.. 11వ రోజు అయిన ఆదివారం 22.68 కోట్లు సాధించి 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. 11 రోజుల్లో ఈ సినిమా హిందీలో 321.12 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. బాహుబలి-2 తర్వాత హిందీలో 300 కోట్ల క్లబ్ లో చేరిన సౌత్ సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు క్రియేట్ చేసింది.

బాహుబలి-2 హిందీలో రెండు వారాల్లో 390.25 కోట్లు కలెక్ట్ చేయగా.. కేజీఎఫ్-2 దాదాపు 345 కోట్లు వసూలు చేసే అవకాశముంది. మొదటివారం బాహుబలి-2 కి మించిన జోరు చూపించిన కేజీఎఫ్-2 ఆ తర్వాత కాస్త జోరు తగ్గించింది. ఫుల్ రన్ లో బాహుబలి-2 హిందీలో 510 కోట్ల నెట్ వసూలు చేయగా.. కేజీఎఫ్-2 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశముంది అంటున్నారు.