English | Telugu
అమితాబ్ భార్య జయాబచ్చన్ కి ఏమైంది!.ఆ హీరో సినిమాపై ఇప్పుడు నిప్పులేందుకు
Updated : Mar 19, 2025
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)వైఫ్ ఒకప్పటి హీరోయిన్ జయాబచ్చన్(Jaya Bachchan)గురించి సినీ ప్రేమికులకి తెలిసిందే.'జయబాధురి' గా ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.1963 లో 'మహానగరి' అనే బెంగాలి చిత్రంతో వెండి తెర ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత హిందీ చిత్రసీమలో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది.జవానీ దివాని లో నీతా ఠాకూర్,పరిచయ్ లో రమారాయ్, ఇండియన్ సినిమాని మలుపు తిప్పిన షోలే(Sholey)జంజీర్'(Zanjeer)లో రాధా సింగ్, మాల గా,దిల్ దివానా లో నీత,చుప్ కె చుప్ కె లో వసుధాకుమార్ ,సిస్ లా లో శోభా మల్హోత్రా ఇలా ఎన్నో హిట్ సినిమాల్లోని తన పాత్రల ద్వారా నేటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆమె నటన అజరామరంగా కొలువుతీరి ఉంది.చివరగా 2023 లో 'రాకీ ఔర్ ప్రేమ్ కహాని' లో ప్రాధాన్యత గల పాత్రని పోషించింది.
రీసెంట్ గా జాతీయ మీడియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయా బచ్చన్ పాల్గొంది.అందులో ఆమె అక్షయ్ కుమార్ గత చిత్రం టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'(toilet ek prem katha) మూవీ గురించి మాట్లాడుతు అసలు ఆ టైటిల్ ఏంటి,అలాంటి టైటిల్ తో ఉన్న సినిమాలని చూడటానికి నేను అసలు ఇష్టపడను.రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అలాంటి చిత్రాలని రూపొందిస్తాయి.ఇక్కడున్న వాళ్ళల్లో మీకే చాలా మందికి ఆ మూవీ నచ్చి ఉండదు.అదొక ప్లాప్ సినిమా అని చెప్పుకొచ్చింది. జయాబచ్చన్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
2017 లో అక్షయ్ కుమార్(Akhaykumar)భూమి ఫడ్నేకర్(Bhumi Pednekar)జంటగా శ్రీ నారాయణ సింగ్(Sri Narayan singh)దర్శకత్వంలో టాయ్ లెట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్రామీణ పాంత్రాల్లోని మరుగుదొడ్ల కొరతని ఎత్తి చూపడమే కాకుండా తన భార్య కోరిక మేరకు ఒక వ్యక్తి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఎలాంటి కృషి చేసాడనే పాయింట్ పై ఈ చిత్రం తెరకెక్కింది.ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే దక్కించుకుంది.