English | Telugu

సికందర్ కి ప్రభుత్వం నో పర్మిషన్! అభిమానులకి నిరాశేనా!

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)రంజాన్(Ramadan)కానుకగా ఈ నెల 30 న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'(Sikandar)తో వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానున్నాడు.వరుస విజయాలతో ఇండియన్ టాప్ హీరోయిన్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చేస్తుండటం గతంలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్(Amir khan)తో గజిని ని తెరకెక్కించిన సౌత్ డైరెక్టర్ మురగదాస్(A R Murugadoss)చాలా గ్యాప్ తర్వాత సికందర్ కి చేస్తుండటంతో అంచనాలు పీక్ లో ఉన్నాయని చెప్పవచ్చు.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు,సాంగ్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ భావించారు.కానీ సల్మాన్ కి కొన్ని నెలల క్రితం గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపుల దృష్ట్యా ఈవెంట్స్ కి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని ఒక ఆంగ్ల పత్రికలో వార్తలు ప్రచురితమయ్యాయి.దీంతో సల్మాన్ ని పబ్లిక్ గా చూడాలని కోరుకున్న అభిమానులకి ఈ న్యూస్ నిరాశని కలిగిస్తుంది.డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా సికందర్ కి సల్మాన్ ప్రమోషన్స్ చేస్తాడని తెలుస్తుంది.

రీసెంట్ గా మురుగదాస్ సికందర్ మూవీ గురించి మాట్లాడుతు మూవీలో సల్మాన్ ఎంట్రీ ఎవరు ఊహించని విధంగా మూవీకే ప్రత్యేకంగా నిలుస్తుంది.స్క్రిప్ట్ రాసేటప్పుడే హీరో అభిమానులను పరిగణనలోకి తీసుకుని,సల్మాన్ స్టార్‌డమ్‌ని ప్రతిబింబించేలా రాసాను.ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు సెకండ్ ఆఫ్ లో హృదయాన్ని కరిగించే సన్నివేశాలు ఉన్నాయి.క్లైమాక్స్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.