Read more!

English | Telugu

భ‌ర్త ఇంటిపేరును తీసేసి స‌మంత‌ను ఫాలో అవుతున్న ప్రియాంక‌?

 

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో త‌న పేరు చివ‌ర‌నున్న భ‌ర్త ఇంటిపేరు 'జోనాస్‌'ను తొల‌గించ‌డం ద్వారా ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌లో మోస్ట్ ల‌వింగ్ క‌పుల్స్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ క‌పుల్ ఒక‌ట‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ను ఆనందంతో పాటు ఇన్‌స్పిరేష‌న్‌నూ ఇస్తుంటారు. త‌న ఫ్యామిలీతో, భ‌ర్త‌తో ప్రియాంక బ‌ల‌మైన అనుబంధాన్ని మెయిన్‌టైన్ చేయ‌డ‌మే కాకుండా, మీడియాతోనూ ఫ్రెండ్లీగా న‌డుచుకుంటూ ఉంటుంది. 

2018 మేలో అమెరిక‌న్ సింగ‌ర్‌-యాక్ట‌ర్ నిక్ జోనాస్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నానంటూ బ‌హిరంగంగా వెల్ల‌డించి వార్త‌ల్లో నిలిచిన ప్రియాంక‌.. ఆ త‌ర్వాత అత‌డిని గ్రాండ్‌గా జ‌రిగ‌న వేడుక‌లో పెళ్లాడిన విష‌యం మ‌న‌కు తెలుసు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ హ్యాండిల్స్ నుంచి స‌డ‌న్‌గా త‌న పేరులోంచి 'జోనాస్' అనే భ‌ర్త ఇంటిపేరును ఆమె తొల‌గించ‌డం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. వెంట‌నే అంద‌రికీ స‌మంత వ్య‌వ‌హారం గుర్తుకు రావ‌డంలో త‌ప్పేమీ లేదు. ప్రియాంక కూడా ఆమె బాట‌లో ప‌య‌నిస్తోందా అనే సందేహాలు అంత‌టా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌మంత సైతం ఇదే త‌ర‌హాలో ఇదివ‌ర‌కు త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో త‌న పేరులోంచి 'అక్కినేని' అనే ఇంటిపేరును తొల‌గించి, ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్రియాంక‌, నిక్ విడిపోనున్నార‌నే రూమ‌ర్స్ వైర‌ల్ కావ‌డంతో ప్రియాంక త‌ల్లి మ‌ధు చోప్రా వాటిని ఖండించి, అలాంటివాటిని వ్యాప్తి చేయొద్ద‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ ముక్క‌ను ప్రియాంక నోటి నుంచి వినాల‌ని అస‌హ‌నంగా ఎదురుచూస్తున్నారు.

2018 డిసెంబ‌ర్ 1న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భ‌వ‌న్ ప్యాలెస్‌లో ఇటు హిందు, అటు క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో ప్రియాంక‌, నిక్ జోనాస్ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న పేరును చ‌ట్ట‌బ‌ద్ధంగా ప్రియాంక చోప్రా జోనాస్‌గా మార్చుకుంది ప్రియాంక‌.