English | Telugu
ఫొటో స్టోరీ.. సారా ప్రపంచమంతా అమ్మ అమృతే!
Updated : Feb 9, 2021
ఈ రోజు బాలీవుడ్ సీనియర్ నటి, సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది కూతురు సారా అలీఖాన్. ప్రెజెంట్ క్రేజీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో రాణిస్తున్న సారా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అమ్మ అమృత, సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో సముద్రంపై తీయించుకున్న పిక్చర్స్‌ను షేర్ చేసింది.
ఆ ఫొటోలకు, "నా మొత్తం ప్రపంచానికి జన్మదిన శుభాకాంక్షలు. నా అద్దం, నా బలం, నా స్ఫూర్తి అయిన నీకు థాంక్యూ." అంటూ క్యాప్షన్ పెట్టింది. అంతే కాదు, #likemotherlikedaughter #soulsisters #maa అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించింది. సారా పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే ఈ పోస్ట్‌కు 1 మిలియన్ పైగా లైక్స్ రావడం ఓ పెద్ద విశేషం. ఆన్‌లైన్‌లో ఈ పిక్చర్స్ అసాధారణ రీతిలో వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీఖాన్‌తో విడిపోయాక పిల్లలిద్దరినీ తనతో తెచ్చేసుకున్నారు అమృత. వారికి సంరక్షకురాలయ్యారు. మరోవైపు అమృతతో విడిపోవడానికి ముందే కరీనా కపూర్‌తో ప్రేమలో పడిన సైఫ్, ఆ తర్వాత ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.
సందర్భం వచ్చిన ప్రతిసారీ, తల్లి అమృతపై తన అపారప్రేమను సారా వ్యక్తం చేస్తూనే ఉంటోంది. ఆమె జీవిత పర్యంతం తను తోడుగా ఉంటాననే ఇంటెన్షన్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తూ వస్తోంది. ఈ తల్లీకూతుళ్ల బంధం ఎంత బలంగా ఉందనేందుకు సారా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిలే నిదర్శనం.