English | Telugu

నా భర్త నుంచి నన్ను దూరం చేస్తారా..ఒక్క సినిమాకి కూడా వెళ్లలేదు 

నా భర్త నుంచి నన్ను దూరం చేస్తారా..ఒక్క సినిమాకి కూడా వెళ్లలేదు 

ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా(Govinda)గురించి తెలియని మూవీ లవర్ లేడంటే అతిశయోక్తి లేదు.90 వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు.కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గోవిందా 1987 లో సునీత అహుజా(Sunita Ahuja)అనే ఆవిడని  వివాహం చేసుకున్నాడు.కొంత కాలం నుంచి ఆ ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటు వస్తున్నారు. సునీత కొన్ని రోజుల క్రితం   క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు'వచ్చే జన్మలో గోవిందకి భార్య కాకూడదని అనుకుంటున్నాను.ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే ధ్యాస లేదు.పెళ్లి అయ్యాక మేమిద్దరం కలిసి చూసిన సినిమా ఒక్కటి కూడా లేదని చెప్పుకొచ్చింది.దీంతో ఆ ఇద్దరు విడిపోతున్నారని,అందుకే విడి విడిగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంపై సునీత రీసెంట్ గా మాట్లాడుతు నా భర్త రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే  రకరకాల వ్యక్తులు ఆయన్ని కలిసేందుకు మా ఇంటికి వస్తుండేవాళ్లు.దీంతో నా కుమార్తె నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాం.ఇంట్లో ఉన్నప్పుడు నచ్చిన బట్టలు వేసుకోవడం,ఇల్లంతా తిరుగుతు సరదాగా ఉండటం మా ఇద్దరికి ఇష్టం.కానీ వేరే వాళ్ళు రావడం వలన అలా చేయలేకపోతున్నాం.అందుకే మా ఇంటికి దగ్గర్లోనే మరో ఇంటిని తీసుకొని,అందులో నేను,నా కుమార్తె ఉంటున్నాం.ఆ మాత్రానికే నేను నా భర్త విడిపోయామని ప్రచారం చేస్తారా.నన్ను నా భర్తని విడతీసే దైర్యం ఎవరికైనా ఉంటే,నా ముందుకు రమ్మని చెప్పండని చెప్పుకొచ్చింది.

గోవింద కాంగ్రెస్(Congress)తరుపున 2004 -09 మధ్య పార్లమెంట్ నెంబర్ గా పని చేసాడు.ప్రస్తుతం శివసేన(Shiv Sena)పార్టీలో కొనసాగుతున్నాడు. గోవిందా, సునీత కి ముగ్గురు పిల్లలు.

 

నా భర్త నుంచి నన్ను దూరం చేస్తారా..ఒక్క సినిమాకి కూడా వెళ్లలేదు