English | Telugu

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం..దిగ్గజ శిఖరం మృతి 

భారతీయ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లో ఎన్నో అత్యున్నతమైన చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత గంగు రామ్ సే కన్నుమూశారు. నెల రోజులు క్రితం అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటినుంచి ఆయనకీ ట్రీట్ మెంట్ జరుగుతుంది. చివరకి పరిస్థితి విషమించడంతో నిన్న చనిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకి తెలిపారు.

ఇక రామ్ సే నిర్మాతగానే కాకుండా కెమెరామెన్ గా కూడా పని చేసారు. హవేలీ, టేకాన లాంటి హర్రర్ చిత్రాలతో పాటుఖిలాడీ,ఆషిక్ ఆవారా లాంటి చిత్రాలు ఆయనకి మంచి పేరు తెచ్చాయి. తన సోదరులతో కలిసి సుమారు 50 చిత్రాలకి పైగా నిర్మించారు.ఆయన వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తన విచారాన్ని వ్యక్తం చేసారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.