English | Telugu

హిందువుల పండుగని అవమానించిన స్టార్ డైరెక్టర్..కేసులు నమోదు 

హిందువుల పండుగని అవమానించిన స్టార్ డైరెక్టర్..కేసులు నమోదు 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో హిట్ సాంగ్స్ కి  కొరియోగ్రాఫ్ ని అందించిన స్టార్ కొరియోగ్రాఫర్ 'ఫరా ఖాన్'(Farah Khan)దర్శకురాలిగా కూడా 'మే హూ నా,ఓం శాంతి ఓం,తీస్ మార్ ఖాన్,హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని ప్రేక్షకులకి అందించింది.వీటిల్లో 'తీస్ మార్ ఖాన్' తప్ప మూడు చిత్రాల్లో కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Sharukh Khan)నే హీరో.దీన్ని బట్టి 'ఫరా ఖాన్' రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.నటిగా,నిర్మాతగాను ఇండియన్ సినిమాకి ఎన్నో సేవలు చేస్తు వస్తుంది.

ప్రస్తుతం ఫరా ఖాన్ సోనీ లైవ్ లో 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అందులో ఆమె హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే 'హోలీ పండుగ గురించి మాట్లాడుతు'హోలీ' అనేది చాప్రి పండుగ.ఒక వర్గం వారు ఎంతో ఇష్టంగా హోలీ(Holi)జరుపుకుంటారని వ్యాఖ్యానించింది.దీంతో హోలీ ని వర్ణించడానికి 'చాప్రి' అనే పదాన్ని ఉపయోగించడం చాలా అనుచితమని,'చాప్రి' అంటే సంస్కృతిలేని మనుషులు అనే అర్థం వస్తుంది.మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హిందూ సమాజాన్ని కూడా ఫరా ఖాన్ అవమానించిందంటు ముంబైతో పాటు చాలా చోట్ల ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.ఫరా ఖాన్ మతపరమైన మనోభావాలు దెబ్బతిశారంటు ప్రముఖ న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ కూడా ముంబైలోని 'ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు

ఇక పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా ఫరా ఖాన్ పై మండిపడుతు, ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.ఫరా ఖాన్ అయితే తాను  చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించలేదు.ఆమె తెలుగులో కూడా అఖిల్(Akhil),నాగార్జున(Nagarjuna)లు కలిసి చేసిన 'సిసింద్రీ' మూవీకి కూడా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది.