English | Telugu

హేమ‌మాలిని ఎంత‌టి ఆస్తిప‌రురాలో ఊహించ‌లేరు!

'డ్రీమ్ గాళ్' అన‌గానే మ‌న‌కు హేమ‌మాలిని గుర్తుకువ‌స్తారు. ఆమె త‌ర్వాత ఆ బిరుదు మ‌రెవ‌ర‌కీ ప్రేక్ష‌కులు ఇవ్వ‌లేదు. ద‌క్షిణాది నుంచి ఉత్త‌రాది చిత్ర‌సీమ‌కు వెళ్లి టాప్ హీరోయిన్‌గా వెలిగిన వారిలో ఆమె ఒక‌రు. 1963 నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న ఆమె బాలీవుడ్‌లో అనేక బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో ఇటు గ్లామ‌ర్‌, అటు ప‌ర్ఫార్మెన్స్‌కు అవ‌కాశం ఉన్న రోల్స్‌లో రాణించి, ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా అవ‌త‌రించారు. త‌న సుదీర్ఘ కెరీర్‌లో 170కి పైగా చిత్రాల్లో న‌టించారు. ఆ మ‌ధ్య 'గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రంలో బాల‌కృష్ణ త‌ల్లిగా కూడా ఆమె క‌నిపించారు.

ఒక రిపోర్ట్ ప్ర‌కారం హేమ‌మాలిని ద‌గ్గ‌రున్న నిక‌ర ఆస్తుల విలువ రూ. 440 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ముంబైలోని గోరేగావ్ ఏరియాలోని ఓ విలాస‌వంత‌మైన బంగ‌ళాలో ఆమె నివాసం ఉంటున్నారు. 2004లో అఫిషియ‌ల్‌గా భార‌తీయ జన‌తా పార్టీలో చేరి, త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆమె ప్రారంభించారు.

హేమ‌మాలినికి కార్లు అంటే వ్యామోహం ఎక్కువ‌. ఆమె ద‌గ్గ‌ర ఒక మెర్సిడెజ్ బెంజ్ ఎంఎల్‌-క్లాస్‌, ఒక హ్యుంద‌య్ సాంటా ఫే, ఆడి క్యూ5 కార్లు ఉన్నాయి. 1980లో ఆమె అప్ప‌టి టాప్ స్టార్స్‌లో ఒక‌రైన ధ‌ర్మేంద్ర‌ను వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌కు ఆమె రెండో భార్య‌. వారికి ఇద్ద‌రు కుమార్తెలు.. ఇషా డియోల్‌, అహ‌న డియోల్.. ఉన్నారు.

ఇక ధ‌ర్మేంద్ర విష‌యానికి వ‌స్తే ఆయ‌న నిక‌ర ఆస్తుల విలువ రూ. 510 కోట్ల పైమాటే. ఆయ‌న‌కు విజేతా ఫిలిమ్స్ అనే సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ముంబై స‌మీపంలోని హిల్ స్టేష‌న్ లోనావాలాలో ఆయ‌న‌కు ఓ ఫామ్‌హౌస్ ఉంది. ప్ర‌స్తుతం ముంబైలోని జుహు ఏరియాలో ఉన్న భ‌వంతిలో ఆయ‌న నివ‌సిస్తున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ఒక మెర్సిడెజ్ బెంజ్ ఎస్ఎల్500, ఒక రేంజ్ రేవ‌ర్ ఎవోక్ కార్లు ఉన్నాయి.

ఈ దంప‌తుల ఇద్ద‌రి ఆస్తుల విలువ క‌లిపితే రూ. 950 కోట్ల‌కు పైనే ఉంటుంద‌న్న మాట‌.