English | Telugu

బ్లాక్‌బ‌స్ట‌ర్ 'హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్' గురించి మ‌న‌కు తెలీని మైండ్ బ్లోయింగ్ నిజాలు!

జూన్ 18వ తేదీతో 'హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్' విడుద‌లై 22 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. రొమాంటిక్ మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ మూవీలో స‌ల్మాన్ ఖాన్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ఐశ్వ‌ర్యా రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 1999లోని బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిల‌వ‌గా, ఇస్మాయిల్ ద‌ర్బార్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

* ఈ సినిమాలో వ‌న‌రాజ్ క్యారెక్ట‌ర్‌కు భ‌న్సాలీ ప‌లువురు న‌టుల‌ను సంప్ర‌దించాడు. వారిలో షారుఖ్ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌, అనిల్ క‌పూర్‌, సంజ‌య్ ద‌త్‌, అక్ష‌య్ కుమార్ ఉన్నారు. చివ‌ర‌కు ఆ క్యారెక్ట‌ర్ అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను వ‌రించింది.

* 'ఖామోషి: ద మ్యూజిక‌ల్' (1996) త‌ర్వాత స‌ల్మాన్‌, భ‌న్సాలీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో సినిమా ఇది.

* ఈ సినిమాలో స‌మీర్ పాత్ర‌ధారి స‌ల్మాన్ ఖాన్ ఆకాశం వైపు చూస్తూ మృతుడైన త‌న తండ్రితో మాట్లాడుతుంటాడు. చిన్న‌ప్పుడు భ‌న్సాలీ అలాగే చేసేవాడు. దాన్నే ఈ సినిమాలో స‌మీర్ పాత్ర‌కు ఉప‌యోగించాడు.

* స‌ల్మాన్ ఖాన్‌, ఆయ‌న స‌వ‌తి త‌ల్లి హెలెన్ (ప్ర‌ఖ్యాత నాట్య‌తార‌) క‌లిసి న‌టించిన తొలి సినిమా ఇదే.

* మొద‌ట ఈ సినిమాకు పెట్టిన టైటిల్ 'దిల్ తో హ‌మ్‌నే దియా స‌న‌మ్‌'.