English | Telugu

మగబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. ఆనందంలో రణవీర్‌సింగ్‌!

మగబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. ఆనందంలో రణవీర్‌సింగ్‌!

బాలీవుడ్‌ స్టార్‌ జంట దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్‌ తల్లిదండ్రులయ్యారు. దీపిక ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్‌లో డేట్‌ ఇచ్చినప్పటికీ గర్భం దాల్చిన 7 నెలలకే డెలివరీ జరిగింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉఉన్నారని వైద్యులు తెలిపారు. బాలీవుడ్‌లో టాప్‌ హీరో, హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొనె 2018లో వివాహం చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఈ జంట ఇప్పుడు పేరెంట్స్‌గా మారారు. తమ తొలి సంతానాన్ని చూసుకొని ఈ ఇద్దరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. మొదటి బిడ్డ పుట్టిన సందర్భంగా సన్నిహితులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.