English | Telugu
చావా చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేక్షకులు..పసి పిల్లలు సైతం ఏడుపులు
Updated : Feb 17, 2025
విక్కీకౌశల్(Vicky Kaushal),రష్మిక(Rashmika mandanna)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'చావా'(Chhaava)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)తనయుడు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(chhatrapati sambhaji maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైన అన్ని చోట్ల విజయపథాన దూసుకుపోతుంది.విక్కీ కౌశల్ తో పాటు రష్మిక తమ క్యారెక్టర్స్ లో జీవించారని,ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటనకి ప్రతి యొక్క ప్రేక్షకుడు జేజేలు పలుకుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర ప్రేక్షకులు అయితే 'చావా'కి బ్రహ్మ రధం పడుతున్నారు.క్లయిమాక్స్ సీన్ లో ఔరంగ జేబు(Aurangzeb)శంభాజీ మహారాజ్ ని చిత్రహింసలకి గురి చేసే సన్నివేశాలకి అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్స్ లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.చిన్న పిల్లలు సైతం కన్నీళ్లు పెట్టుకుంటూ 'శంభాజీ మహారాజ్' కి జై అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar)దర్శకత్వంలో దినేష్ విజయన్(Dinesh Vijayan)నిర్మించిన 'చావా'లో అక్షయ్ ఖన్నా,దివ్య దుత్త, అశుతోష్ రానా,వినీత్ కుమార్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించగా సుభాష్ గోస్వామి కెమెరా బాధ్యతలని అందించాడు.విడుదలైన మూడు రోజులకే 160 కోట్ల గ్రాస్ ని అందుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో చావా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు.