English | Telugu
ఛావా బాక్సాఫీస్ ఊచకోత.. పుష్ప-2 స్థాయిలో వసూళ్ల వర్షం!
Updated : Feb 24, 2025
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'ఛావా'. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా భాషలలో కాకుండా, కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ.. రికార్డు వసూళ్లు రాబడుతోంది. (Chhaava Collections)
ఇండియాలో మొదటి వారం రూ.225.28 కోట్ల నెట్ రాబట్టింది 'ఛావా'. రెండో వారంలో కూడా అదే జోరు చూపిస్తోంది. శుక్రవారం 24.03 కోట్లు, శనివారం 44.10 కోట్లు, ఆదివారం 41.10 కోట్లతో.. సెకండ్ వీకెండ్ లో రూ.109.23 కోట్ల నెట్ సాధించింది. పుష్ప-2 తర్వాత హిందీలో సెకండ్ వీకెండ్ రూ.100 కోట్లకు పైగా నెట్ రాబట్టిన సినిమా 'ఛావా'నే కావడం విశేషం. పది రోజుల్లో 'ఛావా' మూవీ ఇండియాలో రూ.334.51 కోట్ల నెట్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే.. ఇప్పటిదాకా ఇండియాలో రూ.398 కోట్లకు పైగా గ్రాస్, వరల్డ్ వైడ్ గా రూ.465 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఛావా జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది.