English | Telugu
పుష్ప సింగర్ రెండో పెళ్లి ఇతనితోనే
Updated : Jan 29, 2025
పుష్ప పార్ట్ 1(Pushpa part 1)హిందీ లాంగ్వేజ్ కి సంబంధించిన సాంగ్స్ లో 'ఊ అంటావా' పాట పాడిన గాయని కనికా కపూర్(Kanika Kapoor)రెండు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో పలు చిత్రాలకి సంబంధించిన గీతాలు ఆలపిస్తూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.బజార్ మూవీలోని చోడ్ దియా, రాగిణి ఎంఎంఎస్ లోని హలో జీ,ప్రెట్టీ గర్ల్ లోని ప్రెట్టీ గర్ల్ లాంటి పాటలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రీసెంట్ గా కనిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 18 సంవత్సరాలకే ఎన్ఆర్ఐ రాజ్ చంధోక్ తో వివాహం జరిగింది.ఆ తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు.కొంత కాలానికి కొన్ని విషయాల్లో రాజ్ చేసిన మోసాలు నా దృష్టికి వచ్చాయి.అతనితో కలిసి ఉండటానికి నా మనసు ఒప్పుకోలేదు.ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను.కానీ పిల్లలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.
ఇక చేసేది లేక 2012 లో విడాకులు తీసుకొని 2022 లో వ్యాపారవేత్త గౌతం హథీరా మణి ని వివాహం చేసుకున్నాను. ఈ పెళ్లి నా పిల్లలకి కూడా ఇష్టమే.వాళ్లే దగ్గరుండి మా పెళ్లి జరిపించారు.గౌతంతో 15 ఏళ్లుగా పరిచయం ఉంది.2020 లోనే ప్రపోజ్ చేసాడని చెప్పుకొచ్చింది.