English | Telugu

మరోసారి హాస్పిటల్‌లో చేరిన దిలీప్ కుమార్

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.

శ్వాసకోస సమస్యలతో బాధప‌డుతోన్న దిలీప్ కుమార్‌ ను ఇటీవల జూన్ 6 న కుటుంబసభ్యులు అదే ఆసుపత్రిలో చేర్పించారు. రెండు వారాల క్రితం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను మళ్లీ ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జ్ అయిన రెండు వారాల్లోనే దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.

దిలీప్ కుమార్ మొదటిసారి 1944లో వెండితెరకు పరిచయమయ్యారు. కోహినూర్, మొఘల్-ఎ-అజామ్, దేవదాస్ తో పాటు పలు చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ న‌టుడిగా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998 లో కిలా అనే సినిమాలో నటించారు.