English | Telugu

న‌టి-ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్ కొడుక్కి తండ్రి ఎవ‌రో బ‌య‌ట‌పెట్టిన బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌!

బెంగాలీ న‌టి, పార్ల‌మెంట్ మెంబ‌ర్ నుస్ర‌త్ జ‌హా ఆగ‌స్ట్ 26న కోల్‌క‌తాలో ఓ పండంటి కొడుకుకు జ‌న్మ‌నిచ్చి మాతృత్వ మ‌ధురిమ‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే ఆమె పుత్రుడికి తండ్రి ఎవ‌ర‌నే దానిపై ప‌లు ఊహాగానాలు న‌డిచాయి. ఎందుకంటే.. కొంత కాలం క్రితం భ‌ర్త నిఖిల్ జైన్‌తో విడిపోయారు నుస్ర‌త్‌. ట‌ర్కీలో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ట‌ర్కీ వివాహ చ‌ట్టం ప్ర‌కారం వారి పెళ్లి భార‌త్‌లో చెల్లుబాటు కాద‌ని తెలియ‌డంతో వారు విడిపోయారు. ఆ త‌ర్వాతే నుస్ర‌త్ గ‌ర్భం దాల్చింది. దాంతో ఆమె బిడ్డ‌కు తండ్రి ఎవ‌ర‌నే దానిపై మిస్ట‌రీ నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు ఆ మిస్ట‌రీ వీడిపోయింది. ఆమె కుమారుడికి తండ్రి న‌టుడు-రాజ‌కీయ‌వేత్త అయిన దేవ‌శిష్ దాస్‌గుప్తా అలియాస్ య‌ష్ దాస్‌గుప్తా అని తేలింది.

లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌కారం నుస్ర‌త్ కొడుకు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తండ్రి పేరును బ‌య‌ట‌పెట్టింది. అందులో పుట్టిన బాబు పేరు యిషాన్ జె. దాస్‌గుప్తా అని రాశారు. కొంత కాలంగా నుస్ర‌త్‌, య‌ష్ క‌లిసి తిరుగుతున్నార‌నే ప్ర‌చారం ఉంది. బాబును క‌న‌డానికి నుస్ర‌త్ హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు య‌ష్ ఆమె ద‌గ్గ‌ర ఎక్కువ స‌మ‌యం గ‌డిపాడు. అదివ‌ర‌కు ఆ ఇద్ద‌రూ క‌లిసి కోల్‌క‌తా మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫీసును సంద‌ర్శించారు. వాక్సినేష‌న్ కోసం వారు అక్క‌డికి వెళ్లార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇప్పుడు ఆ ప‌నితో పాటు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ కోసం కూడా వారు అక్క‌డికి వెళ్లార‌ని తెలిసింది.

నుస్ర‌త్ జ‌హా, య‌ష్ దాస్‌గుప్తా క‌లిసి 'ఎస్ఓఎస్ కోల్‌క‌తా' అనే బెంగాలీ మూవీలో న‌టించారు. లాక్‌డౌన్ టైమ్‌లో 2020లో ఆ సినిమా విడుద‌లైంది.