English | Telugu

ప్ర‌భాస్ భారీకాయం.. ఆందోళ‌న‌లో 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్‌!

కొన్ని రోజుల క్రితం ప్ర‌భాస్ లుక్స్ చూసిన‌వాళ్లు షాక‌య్యారు. ఓవ‌ర్ వెయిట్‌తో ఉన్న అత‌ని లుక్స్‌పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌చ్చాయి. చాలామంది ప్ర‌భాస్‌కు ఏమైందంటూ అత‌డిని ట్రోల్ చేశారు. ముఖం ఉబ్బి, క‌ళ్ల‌లో అల‌స‌ట క‌నిపిస్తూ, బాగా వ‌య‌సు మీద‌ప‌డిన వాడిలా.. 'బాహుబ‌లి', 'సాహో' సినిమాల్లో క‌నిపించిన ప్ర‌భాస్ ఇత‌నేనా అన్నంత‌గా మారిపోయాడు ప్ర‌భాస్‌. ఇటీవ‌లే 'రాధే శ్యామ్' మూవీలో న‌టించిన అత‌ను ఆ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గానే, అంత‌లా బ‌రువు ఎలా పెరిగిపోయాడ‌ని ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌భాస్ భోజ‌న‌ప్రియుడ‌నే విష‌యం తెలిసిందే కానీ, ప‌ని లేనంత‌మాత్రాన ఇలా పెరిగిపోతాడా అని జోకులు పేల్చారు కొంత‌మంది. అత‌ని ఛార్మింగ్ లుక్స్‌కు అల‌వాటు ప‌డిన ఫ్యాన్స్ కూడా అత‌డి రూపాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అయిన‌ప్ప‌టికీ వారు కెమెరా యాంగిల్ వ‌ల్ల అలా క‌నిపిస్తున్నాడంటూ అత‌డిని వెన‌కేసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

నిజానికి ప్ర‌భాస్ అలా క‌నిపించ‌డానికి కార‌ణం, కెమెరా యాంగిల్ కాద‌నీ, నిజంగానే అత‌ను చాలా బ‌రువు పెరిగాడనీ స‌న్నిహితులు చెప్తున్న మాట‌. 'సాహో' మూవీలో క‌నిపించిన ఎన‌ర్జిటిక్ లుక్‌తో పోలిస్తే, బాగా వ‌య‌సు పెరిగిన‌వాడిలా క‌నిపిస్తున్నాడ‌నీ వారు కూడా అంగీక‌రిస్తున్నారు. మొత్తానికి ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న 'ఆదిపురుష్' సినిమా టీమ్ ఆందోళ‌న‌కు గుర‌యింది. 'బాహుబలి'ని మించిన భారీ బ‌డ్జెట్‌తో 'ఆదిపురుష్‌'ను ఓమ్ రౌత్ డైరెక్ష‌న్‌లో నిర్మిస్తున్నారు.

తెర‌పై శ్రీ‌రామ‌చంద్రునిగా క‌నిపించాల్సిన ప్ర‌భాస్ లేటెస్ట్ లుక్స్ ఓమ్ రౌత్‌ను కూడా ఆందోళ‌న‌కు గురిచేసింద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఒక్క‌సారిగా అలా బ‌రువు పెరిగిపోవ‌డానికి కార‌ణాలు తెలుసుకోవ‌డానికి బాడీ టెస్ట్ కోసం యు.కె.కు వెళ్లాల్సిందిగా డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్స్ ప్ర‌భాస్‌ను క‌న్విన్స్ చేశారంట‌. ప్ర‌పంచంలోనే పేరు పొందిన డైటీషియ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బ‌రువు త‌గ్గ‌డానికి అత‌ను ట్రీట్‌మెంట్ తీసుకోబోతున్నాడంట‌. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత నిజం ఉందో త్వ‌ర‌లోనే మ‌న‌కు తెలుస్తుంది.

కృతి స‌న‌న్‌, సైఫ్ అలీఖాన్‌, స‌న్నీ సింగ్ కీత‌క పాత్ర‌ధారులైన 'ఆదిపురుష్‌'ను టి-సిరీస్‌, మెట్రోఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 ఆగ‌స్ట్ 11న ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను రిలీజ్ చేయాల‌నేది నిర్మాత‌ల సంక‌ల్పం.