Read more!

English | Telugu

'బాహుబ‌లి' భామ‌కు క‌రోనా!

 

'టెంప‌ర్‌'లో "ఇట్టాగే రెచ్చిపోదాం", 'బాహుబ‌లి'లో "మ‌నోహ‌రీ" పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ నోరా ఫ‌తేహి క‌రోనా వైర‌స్ బారిన ప‌డింది. కొద్ది రోజులుగా ఒక్కొక్క‌రుగా సెల‌బ్రిటీలు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతూ వ‌స్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, క‌రీనా క‌పూర్‌, మంచు మ‌నోజ్, అర్జున్ క‌పూర్‌, త‌ర్వాత ఇప్పుడు నోరా ఫ‌తేహి టెస్టులో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆమె టీమ్ ఓ స్టేట్‌మెంట్ ద్వారా తెలియ‌జేసింది. అయితే ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా, లేదా అన్న‌ది మాత్ర‌మే వెల్ల‌డి కాలేదు.

Also read: ​జెనీలియాతో స‌ల్మాన్ డాన్స్‌.. వీడియో వైర‌ల్‌!

"ఈ నెల 28న నోరా ఫ‌తేహి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్ర‌స్తుతం ఆమె అన్ని ర‌కాల‌ ప్రోటోకాల్స్ పాటిస్తూ, డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో క్వారంటైన్‌లో ఉంది." అని ఆ ప్ర‌క‌ట‌న తెలియ‌జేసింది. సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న ఫ‌తేహి ఫొటోలు ఇదివ‌ర‌కు ఆమె పాల్గొన్న ఒక ఈవెంట్‌కు సంబంధించిన‌వ‌నీ, క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ కాగానే ఆమె త‌న ఇంటికే ప‌రిమిత‌మైంద‌నీ, ఆమె బ‌య‌ట‌కు రాలేద‌నీ అందులో స్ప‌ష్టం చేశారు.

Also read: ​సెకండ్ డే మ‌రింత ఎక్కువ‌గా 'పుష్ప' హిందీ వ‌సూళ్లు! నార్త్‌లో బ‌న్నీ మేనియా!!

నోరా సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా త‌న ప్ర‌స్తుత ప‌రిస్థితి వెల్ల‌డించింది. "హే గైస్‌, దుర‌దృష్ట‌వ‌శాత్తూ, ప్ర‌స్తుతం కొవిడ్‌తో యుద్ధం చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది న‌న్ను గ‌ట్టిగా బాధించింది! డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన్ని రోజుల పాటు బెడ్‌కి ప‌రిమిత‌వుతున్నాను" అని ఆమె రాసుకొచ్చింది.

కిక్ 2, షేర్‌, లోఫ‌ర్‌, ఊపిరి సినిమాల్లోనూ ఐట‌మ్ సాంగ్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను అల‌రించింది నోరా.