Read more!

English | Telugu

హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'పుష్ప‌'.. రూ. 60 కోట్ల‌ను క్రాస్ చేసిన ఐకాన్ స్టార్‌!

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించ‌గా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీ హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది. అంచ‌నాల‌ను మించి అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఎన్ని ర‌కాల అడ్డంకులు ఎదుర‌వుతున్నా బెదుర‌న్న‌దే లేకుండా మాస్ పాకెట్స్‌లో రోజు రోజుకూ మ‌రింత వేగంగా దూసుకుపోతోంది. మొద‌టి, రెండు వీకెండ్స్ కంటే మూడో వీకెండ్‌లో మ‌రింత ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ సాధించ‌డం అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో హిందీ ఆడియెన్స్‌ను అల‌రిస్తున్నాడన్న దానికి నిద‌ర్శ‌నం. 

Also read: హైదరాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన థియేటర్!

తొలి వీకెండ్‌లో రూ. 12.68 కోట్లు, రెండో వీకెండ్‌లో 10.31 కోట్లు రాబ‌ట్టిన 'పుష్ప' హిందీ వెర్ష‌న్ థ‌ర్డ్ వీకెండ్‌లో ఏకంగా రూ. 15.85 కోట్ల‌ను వ‌సూలు చేసింది. శుక్ర‌వారం రూ. 3.50 కోట్లు, శ‌నివారం రూ. 6.10 కోట్లు, ఆదివారం రూ. 6.25 కోట్లు వచ్చాయి. వెర‌సి మొత్తం 17 రోజుల‌కు రూ. 62.94 కోట్లు వ‌సూల‌య్యాయి. విడుద‌లైన మొద‌టి రోజు కంటే 17వ రోజు చాలా ఎక్కువ‌గా వ‌సూళ్లు రావ‌డం చూస్తుంటే 'పుష్ప‌'ను ఆడియెన్స్ ఎంత‌గా సొంతం చేసుకున్నారో అర్థ‌మ‌వుతోంది. 

Also read: ​"నేను ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కుగా ఉండ‌ను".. చిరంజీవి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

తొలిరోజు రూ. 3.33 కోట్లు రాబ‌ట్టిన 'పుష్ప‌', నిన్న 17వ రోజు (జ‌న‌వ‌రి 2) రూ. 6.25 కోట్ల‌ను వ‌సూలు చేయ‌డం ఏ ర‌కంగా చూసినా అద్భుత‌మే. కొవిడ్ మ‌హ‌మ్మారి రోజులు, 'స్పైడ‌ర్‌మ్యాన్‌', '83' లాంటి సినిమాల పోటీ, అతి త‌క్కువ ప్ర‌మోష‌న్స్‌, త‌క్కువ స్క్రీన్లు, సాధార‌ణ టికెట్ ధ‌ర‌లు ఉన్న టైమ్‌లో 'పుష్ప' హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చెల‌రేగుతున్న వైనాన్ని మొత్తం బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోన‌వుతూ చూస్తోంది. ప్ర‌భాస్ త‌ర్వాత 'పుష్ప' మూవీతో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ రూపంలో మ‌రో పాన్ ఇండియా స్టార్ ఆవిర్భ‌వించాడ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.