Read more!

English | Telugu

ఇండియన్ అగ్ర నటుడి కూతురు పెళ్లి.. వరుడు ఆమె బాయ్ ఫ్రెండ్

హిందీ అగ్ర నటుడు అమీర్ ఖాన్ కి భారతదేశ వ్యాప్తంగా  కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని స్టార్ హీరో అనే కంటే ప్రేక్షకుల హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తన హీరో ఇమేజ్ కి సంబంధం లేకుండా అనేక విభిమన్నమైన సినిమాల్లో నటించాడు. తాజాగా ఆయన ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యం అమీర్ అభిమానుల్లో ఆనందాన్ని తెచ్చింది.

అమీర్ ఖాన్ కూతురు పేరు ఐరా ఖాన్. ఆమెకి  తన బాయ్ ఫ్రెండ్  నుపుర్ శిఖరేతో  జనవరి 3 న వివాహం జరగనుంది. ముంబై బాంద్రాలోని తాజ్ లాండ్ ఎండ్స్ లో పూర్తిగా మహారాష్ట్ర సాంప్రదాయ పద్దతిలో అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో వారిరువురి వివాహాం జరగనుంది. అనంతరం జనవరి  6 ,10 వ తేదీల్లో జైపూర్ ఢిల్లీ నగరాల్లో రిసెప్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ సినీ పరిశ్రమకి ఒక ప్రత్యేకమైన పార్టీ ని కూడా ఏర్పాటుచేయనున్నారు. 

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా.ఆ ఇద్దరకీ పుట్టిన కూతురే ఐరా ఖాన్. 1986 అమీర్, రీనా ల వివాహాం జరిగింది.  అనంతరం  2002లో  ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమీర్ మన తెలుగు అమ్మాయి అయిన  కిరణ్ రావు ని వివాహాం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా విడిపోయారు.