English | Telugu
సల్మాన్,షారుఖ్ నన్నుతొక్కేయ్యడానికే ఆ కథని నా వద్దకు పంపించారు
Updated : Mar 26, 2025
భారతీయ సినీ చరిత్రలో 'దంగల్'(Dangal)మూవీకి ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే.అమీర్ ఖాన్(Aamir Khan)కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితీష్ తివారి దర్శకత్వంలో సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 2200 కోట్ల దాకా రాబట్టి నేటికీ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.బెస్ట్ ఫిల్మ్,బెస్ట్ యాక్టర్,బెస్ట్ డైరెక్టర్,బెస్ట్ యాక్షన్ వాటితో పాటు,చైనా,ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లో కూడా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ గెలుచుకుంది.68 th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏషియన్ బ్రిలియంట్ స్టార్స్ కేటగిరీ లో కూడా చోటుసంపాదించుకుంది.
రీసెంట్ గా అమీర్ ఒక ఇంటర్వ్యూలో దంగల్ గురించి మాట్లాడుతు ఈ మూవీ స్క్రిప్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు నా కెరీర్ ని దెబ్బ తియ్యడానికి సల్మాన్(Salman khan)షారుక్(sharukh Khan)లు ఈ కథని పంపించారని అపార్ధం చేసుకున్నాను.దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari)మాత్రం నేనే ఈ సినిమా చెయ్యాలని, నా కోసం 15 సంవత్సరాలు అయినా ఎదురుచూస్తానని చెప్పాడు.స్కిప్ట్ చదివాక చాలా శక్తివంతమైనదని అనిపించింది.దంగల్ కి ముందు చేసిన 'ధూమ్ 3 'లో యంగ్ లుక్ లో కనిపించాను.కానీ దంగల్ స్క్రిప్ట్ నచ్చడంతో రిస్క్ చేసైనా దంగల్ లో చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.అమీర్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి
మహా వీర్ సింగ్ ఫోగట్(Mahavir Singh Phogat)క్యారక్టర్ లో అమీర్ ఖాన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.కుస్తీ క్రీడాకారుడు అయిన ఫోగట్ ఆ రంగంలో ఇండియా తరుపున గోల్డ్ మెడల్ సాధించాలని చూస్తాడు.కానీ ఆ కల నెరవేరదు.దీంతో తన ఇద్దరు కూతుళ్ళకి కుస్తీ రంగంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ రంగంలో తిరుగులేని వాళ్ళలాగా తయారు చేస్తాడు.దాంతో ఆ ఇద్దరు కూతుళ్లు ఇండియా తరుపున గోల్డ్ మెడల్ ని సాధించి తన తండ్రి కోరిక నెరవేరుస్తారు. అమీర్ ఖాన్ నే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు.దంగల్ కథ హర్యానా రాష్ట్రంలో మహావీర్ సింగ్ ఫోగట్,ఆయన ఇద్దరు కూతుళ్ళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందనే విషయం తెలిసిందే.