English | Telugu

ప్రభాస్ రికార్డు నాకొక లెక్కే కాదు..రిలీజ్ రోజు మరిన్ని రికార్డులు సృష్టిస్తా

ప్రభాస్ రికార్డు నాకొక లెక్కే కాదు..రిలీజ్ రోజు మరిన్ని రికార్డులు సృష్టిస్తా

మొన్న జూన్ లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)కల్కి 2898(kalki 2898 ad)ఏడి సాధించిన ఘన విజయం గురించి  అందరకి తెలిసిన విషయమే. వెయ్యి కోట్ల మార్కుని కూడా దాటి ఇండియన్  సినీ కలెక్షన్స్ ల హిస్టరీ లో తెలుగు వాడి సత్తాని  చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో కూడా పలు రికార్డులని నమోదు చేసింది. కానీ ఇప్పుడు అవి ఒకప్పుడు అనే మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి వచ్చింది.

రాజ్ కుమార్ రావు(rajkumar rao)శ్రద్ద కపూర్(shraddha kapoor) హీరో హీరోయిన్లు గా చేసిన చిత్రం స్త్రీ 2(stree 2)స్వాతంత్ర దినోత్సవ కానుకగా అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా ల్యాండింగ్  కి సిద్ధం అయ్యింది. ఆల్రెడీ ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సాధించింది.  2018 లో వచ్చిన స్త్రీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ  హర్రర్ అండ్ కామెడీ  మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే   ఉన్నాయి. అందుకు నిదర్శనంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సుమారు 20 కోట్ల రూపాయల దాకా  రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారంగా ప్రకటించింది. ఈ స్థాయిలో కల్కి, హృతిక్ రోషన్ ఫైటర్ లు కూడా సాధించలేకపోయాయి. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ సినీ రంగంలో చర్చినీయాంశ మయ్యింది. విడుదల రోజు ఇంకెన్ని కలెక్షన్స్ ని సాధిస్తుందో అనే చర్చ కూడా మొదలయ్యింది.అదే విధంగా  ఒక్క సారి అందరు ప్రభాస్ గత చిత్రమైన సాహో ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో  ప్రభాస్, శ్రద్దా లు  కలిసి వర్క్  చేసిన విషయం తెలిసిందే. 

ఇక ఈ మూవీ ఇంకో అరుదైన రికార్డుని కూడా  తన ఖాతాలో వేసుకుంది.అగస్ట్ 15 న బాలీవుడ్ లో విడుదల అవుతున్న అన్ని సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కంటే స్త్రీ 2 నే  ఎక్కువ సంపాదించింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన స్త్రీ 2 ప్రేక్షకులని భయపెడుతూనే నవ్వించబోతుంది. అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా ఎంపిక   చేసిన థియేటర్స్ లో ప్రివ్యూలు కూడా పడబోతున్నాయి. తమన్నా ప్రత్యేక గీతంలో చేస్తుంది. 

 

ప్రభాస్ రికార్డు నాకొక లెక్కే కాదు..రిలీజ్ రోజు మరిన్ని రికార్డులు సృష్టిస్తా