English | Telugu
ప్రీతి జింటాను ప్రెగ్నెంట్ చేస్తానన్న షారూఖ్.. బాద్‌షాపై నెటిజన్ల ఫైర్!
Updated : Aug 17, 2024
సినిమాల్లో కొన్ని జంటలు మంచి పేరు తెచ్చుకుంటాయి. వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం, వారు నటించిన సినిమాలు సూపర్‌హిట్ అవ్వడంతో ఆ జంట హిట్ పెయిర్ అని పిలవబడుతుంది. అలా బాలీవుడ్ జంట షారూక్ ఖాన్, ప్రీతి జింటా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. నిజ జీవితంలో కూడా మంచి ఫ్రెండ్స్‌గా వీరికి పేరుంది. వివిధ వెకేషన్స్‌కి సంబంధించి ఒకరినొకరు విష్ చేసుకోవడం వీరికి మామూలే. ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షారూక్, ప్రీతికి సంబంధించిన పాత వీడియో ఇది. ఒక టీవీ షోలో సరదాగా షారూక్‌ను ఇంటర్వ్యూ చేస్తోంది ప్రీతి. మాటల మధ్యలో సడన్‌గా ‘నువ్వు ప్రెగ్నెంటా?’ అని ప్రీతిని అడిగాడు షారూక్. వెంటనే షాక్‌కి గురైన ప్రీతి ఏం సమాధానం చెప్పాలో తెలీక నవ్వుతూ ఉండిపోయింది. ఆ వెంటనే ‘నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తాను..’ అని అన్నాడు షారూక్. అయితే అతను అన్న మాటను అంత సీరియస్‌గా తీసుకోకుండా క్యాజువల్‌గా మాట్లాడుతూ షోను కంటిన్యూ చేసింది ప్రీతి. అయితే షారూక్ అలా ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అది పాత వీడియో కాబట్టి ఈ టాపిక్‌కి ముందు, వెనుక ఏం జరిగింది అనేది తెలియలేదు. అయితే ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షారూక్, ప్రీతి మంచి స్నేహితులు కావడం వల్ల సరదాగా అలా అని ఉంటాడని కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. మరి కొంత మంది ఎంత స్నేహం ఉన్నా.. సరదాకైనా అలాంటి మాటలు మాట్లాడతారా అని కొందరు ఫైర్ అవుతున్నారు. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి అలా బిహేవ్ చెయ్యడం కరెక్ట్ కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. షారూక్ అన్న మాటలకు ప్రీతి కాసేపు ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. నెటిజన్లు దీన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మరి షారూక్ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం శరవేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.