English | Telugu

'యానిమల్ పార్క్' నుంచి బిగ్ అప్డేట్.. మరి 'స్పిరిట్' పరిస్థితి ఏంటి?

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ ఫిల్మ్ 'యానిమల్'(Animal). రూ.200 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. 2023 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో 'యానిమల్'కి సీక్వెల్ గా రానున్న 'యానిమల్ పార్క్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు రణ్‌బీర్‌ కపూర్‌. (Animal Park)

'యానిమల్' వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు 'యానిమల్ పార్క్' పట్టాలెక్కలేదు. దానికి కారణం రణ్‌బీర్‌, సందీప్ రెడ్డి ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటమే. రణ్‌బీర్‌ 'లవ్ అండ్ వార్', 'రామాయణ' సినిమాలు చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'స్పిరిట్'(Spirit) చేస్తున్నాడు.

'స్పిరిట్' పూర్తయ్యాక, ఆరు నెలల విరామం తర్వాత 'యానిమల్ పార్క్' షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని తాజాగా రణ్‌బీర్‌ స్పష్టం చేశాడు. "ప్రస్తుతం సందీప్ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక 2027లో మా సినిమా మొదలవుతుంది. యానిమల్ ను మూడు భాగాలుగా తెరకెక్కించాలి అనేది దర్శకుడి ఆలోచన. రెండో భాగంగా 'యానిమల్ పార్క్' రానుంది. హీరోగా, విలన్ గా రెండు పాత్రలూ నేనే పోషిస్తుండటంతో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిగా ఉన్నాను." అని రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.