English | Telugu

సినిమా బాలేదు కాబట్టి రాళ్లతో కొట్టి ఆ తర్వాత పని అడగండి

 

అక్షయ్ కుమార్(akshay kumar)హీరోగా దీపికా పదుకొనె(deepika padukune)హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం చాందిని చౌక్ టూ చైనా(chandni chowk to chaina)కల్ హో న హో, హీరో, బట్లా హౌస్, వంటి చిత్రాలని తెరకెక్కించిన నిఖిల్ అద్వానీ(nikhil advani)దర్శకత్వంలో  2009 లో విడుదలైన ఆ మూవీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

రీసెంట్ గా జరిగిన  ఒక ఇంటర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతు అమీర్ ఖాన్, షారుక్ ల గజనీ,రబ్ నే బనాది జోడి లాంటి  సినిమాలు వంద కోట్ల మార్కుని అందుకోవడంతో ఆ సమయంలోనే వచ్చిన చాందిని చౌక్ టూ చైనా కూడా రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తుందని అందరు నమ్మారు.కానీ మూవీ విజయం సాధించదని నాకు తెలుసు.ఎందుకంటే సెకండ్ ఆఫ్ లో చాలా సమస్యలు ఉన్నాయి.వాటిని పరిష్కరించాలని అనుకున్నా కూడా ఒక పడవకి ఎక్కువ మంది కెప్టెన్స్ ఉండటం వల్ల సాధ్యం కాలేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లకి ఉండటం వల్లనే సినిమా దెబ్బతింది.

 

ఒక విలేకరి కూడా మా ఇంటి ముందుకొచ్చి మన డబ్బులు వృధా చేసిన వాడి ఇల్లు ఇదే, రాళ్లతో కొట్టండి అన్నాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. కాకపోతే ఆ తర్వాత పదేళ్లకి అతను నా దగ్గర పని చెయ్యడానికి వచ్చాడు. కర్మ అంటే ఇదేనేమో.కాకపోతే నేను అతనికి గతాన్ని గుర్తు చెయ్యదలుచుకోలేదు. నా సంస్కారమే నన్నుఆపింది.డిస్ట్రిబ్యూట్ చేసిన వార్నర్ బ్రదర్స్ చాలా నష్టపోయారని చెప్పాడు..మార్షల్ ఆర్ట్స్ ని ప్రధానంగా చేసుకొని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రోహన్ సిప్పి,రమేష్ సిప్పి నిర్మించారు.